ఇంత కాలం ట్రోలింగ్స్ కి దూరంగా వున్న కింగ్ నాగార్జున బిగ్ బాస్ కారణంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. జర్నలిస్ట్ శ్వేతారెడ్డి అంత హడావుడి చేసినా దానిపై నోరు మెదపకుండా ఆ వార్తల్ని లైట్ తీస్కున్నారు నాగ్. ఆ వివాదం సద్ధుమణిగింది అనగానే.. తాజాగా ఆయన నటించిన `మన్మథుడు-2` పై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఫ్యామిలీ మ్యాన్ నాగార్జున ఇంత వరకు నటించిన చిత్రాలకు భిన్నంగా వల్గారిటీ కనిపించడంతో డే వన్ నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఈ సినిమా చూసిన ఓ నెటిజన్ ఏకంగా నాగార్జననే సామాజిక మాధ్యమాల్లో దుయ్యబట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఓవర్ డోస్ సీన్స్ నచ్చని అభిమానికి చిర్రెత్తుకొచ్చింది. నాగార్జున గారికి వల్గర్ కామెడీ నచ్చుతుందా? పరిశ్రమ ఎటెళుతోంది? ఆరు పదులకు చేరిన హీరో సమాజానికి మార్గదర్శనం చేయాల్సింది పోయి మరీ ఈ వయసులో ఇంతలా బరితెగించడం ఏమీ బాగాలేదు.. హిట్టు కోసమే ఇంతగా బరితెగించాలా? అని మండిపడుతున్నాడు. మీలాంటి వాళ్లే వల్గర్ కామెడీని ప్రోత్సహిస్తుంటే టాలీవుడ్ లోని మిగతా హీరోల పరిస్థితేంటి? మీరే ఇలా బరితెగిస్తే ఎలా? సోషల్ మీడియా వేదికగా మహిళా సాధికారత గురించి మాట్లాడే చిన్మయి ఈ సినిమా విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు? అంటూ విరుచుకుపడ్డాడు.
ఈ విషయంలో ఆమె పెద్ద ఫ్రాడ్గా కనిపిస్తోంది. మదర్ థెరిసా.. మలాలా తరహాలో ఫోజిచ్చే చిన్మయి `మన్మథుడు-2` వల్గర్ కామెడీపై ఎందుకు కామెంట్ చేయడం లేదు. ప్రతి విషయంలోనూ వేలు పెట్టి మరీ రాద్ధాంతం చేసి రచ్చ చేసే చిన్మయి తన భర్త సినిమా విషయానికి వచ్చే సరికి ఎందుకు సైలెంట్ అయిపోయింది. ఇది తన పర్సనల్ లైఫ్ కాబట్టే కామెంట్ చేయడం లేదా? లేక ఎక్కడ నెటిజన్స్ ట్రోల్ చేస్తారోనని భయపడుతోందా? అని నెటిజన్స్ చురకలంటించడం ఆసక్తికరంగా మారింది. మరి నెటిజనుల ప్రశ్నలకు నాగ్ .. చిన్మయి ఏం జవాబు చెబుతారో?