దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలను మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ఆడియెన్ అంత ఇదిగా వోన్ చేసుకోవడానికి కారణమేమిటి? అంటే ఆయన చూపించే ఉద్వేగాలు యాక్షన్ కి ఉన్న రేంజు అలాంటిది అని ఎవరైనా చెబుతారు. ఒళ్లు గగుర్పొడిచే భీకరమైన యాక్షన్ ఎపిసోడ్ .. నరాలు తెగే ఉత్కంఠ.. పీక్ ఎమోషన్ .. సస్పెన్స్ ఇన్ని ఎలిమెంట్స్ ని యాక్షన్ సినిమాకి జోడిస్తారు కాబట్టే జనం స్క్రీన్ కి కళ్లప్పగించి చూస్తారు.
బాహుబలి సక్సెస్ వెనక ఇంత కథ ఉంది మరి. ఇండియన్ స్క్రీన్ పై నెవ్వర్ బిఫోర్ యాక్షన్ సీక్వెన్సులు చూపించిన ఘనత మన రాజమౌళిదే. అందుకే ఆయన సినిమా తీస్తున్నారు అంటే బాలీవుడ్ వాళ్లే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ కోసం ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు- కొమురం భీమ్ కథల్ని ఫిక్షనలైజ్ చేసి భారతదేశ స్వాతంత్య్రానికి ముందు ఏం జరిగింది? అనే ఆసక్తికర కథతో ఆర్.ఆర్.ఆర్ మూవీని తెరపై ఆవిష్కరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం..ఈ మూవీకి సంబంధించిన అతి భారీ యాక్షన్ ఎపిసోడ్ ని పూర్తి చేశారని తెలుస్తోంది. 50 రోజుల పాటు సింగిల్ యాక్షన్ సీన్ తీశారని తెలిసింది.
ఒక మల్టీస్టారర్ కోసం ఒకే యాక్షన్ సీక్వెన్స్ కోసం యాభై రోజులు పని చేయడం అనేది గతంలో వినని విషయం. ఇలాంటిది రాజమౌళికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆ షెడ్యూల్ ని ముగించి వెంటనే చిత్ర బృందం కొత్త షెడ్యూల్ ని ప్రారంభించిందిట. ఈ చిత్రం సంక్రాంతి 2021 కి విడుదల కావాల్సి ఉన్నా.. మహమ్మారి కారణంగా వాయిదా పడింది. వేసవికి కష్టమే కాబట్టి దసరా 2021 విడుదలకు ప్లాన్ చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
2021 వేసవిలో మాత్రమే ఈ బృందం తన విడుదల ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది. మహమ్మారీ ప్రభావం పోయాకే ఈ మూవీని రిలీజ్ చేసే ఆలోచన ఉందిట. ఇప్పటికే తారక్ .. చరణ్ ల పాత్రలపై విడుదల చేసిన వీడియోలు సంచలనం సృష్టించాయి. మునుముందు టీజర్ ట్రైలర్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడోనన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది.