సినిమాలు చాలానే వస్తాయి.. పోతాయి. కానీ.. కొన్ని సినిమాలు అలా మదిలో మెదులుతూనే ఉంటాయి. వీటన్నింటికి మించి కొన్ని సినిమాల్లోని డైలాగులు జన జీవితాల్లో భాగం కావటమే కాదు.. ఏళ్లకు ఏళ్లు గడిచినా పోకుండా కంటిన్యూ అవుతుంటాయి.
చివరకు వ్యవహారిక భాషలో భాగంగా మారిపోతుంటాయి. అప్పుడెప్పుడో వచ్చిన సీనియర్ నరేశ్ నటించిన సినిమాలోని 'నీ ఎంకమ్మ' ఇప్పటికి తెలుగు ప్రజలు వాడేస్తుంటారు. అలాంటి పాపులర్ డైలాగులు అరుదుగా పడుతుంటాయి.
ఈ మధ్యన వచ్చిన సినిమాల్లోని డైలాగుల్లో బాగా పాపులర్ అయిన వాటిల్లో ఒకటి.. 'నెవ్వర్ బిఫోర్...ఎవ్వర్ ఆఫ్టర్' అయితే.. మరొకటి పుష్ప మూవీలోని తగ్గేదెలే అన్న డైలాగ్.
దీన్ని సామాన్యుడి నుంచి రాజకీయ పార్టీల నేతలు సైతం వాడేస్తుండటం గమనార్హం. ఇక.. 'నెవ్వర్ బిఫోర్...ఎవ్వర్ ఆఫ్టర్' డైలాగ్ విషయానికి వస్తే.. ఇదెలా పుట్టింది? అన్న సందేహం రాక మానదు.
ఇదే విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడిని అడిగితే ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 'హనుమాన్ జంక్షన్ సినిమాలో కొవై సరళ.. అబ్బబ్బ.. న భూతే నభవిష్యత్ అన్న డైలాగ్ చెబుతారు.
దాని స్పూర్తితోనే 'నెవ్వర్ బిఫోర్...ఎవ్వర్ ఆఫ్టర్' అని రాశానని గుట్టు విప్పారు. నిజ జీవితంలో ఫోన్ లో మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు వస్తుంటాయి. చాలామంది క్యాజువల్ గా మాట్లాడే మాటల్ని జాగ్రత్తగా గమనించినప్పుడు కొన్ని కొత్తగా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిని వాడుతుంటా. దానికి ఉదాహరణ.. 'అంతేగా.. అంతేగా' అన్న మాట అని చెప్పుకొచ్చారు.