జార్జి రెడ్డి.. కమ్యూనిస్టు భావనలు ఉన్న విప్లవ విద్యార్థి నాయకుడు. ఉస్మానియా యూనివర్సిటీ లో విద్యార్థి నాయకుడిగా సంస్కరణల పిపాసి గా కొత్త బాట వేసిన ధీశాలి. అయితే కమ్యూనిజానికి , హిందుత్వానికి అస్సలు పడదు. ఇప్పుడు 'జార్జిరెడ్డి' మూవీ కేంద్రంగా ఆయన హత్యకు దారితీసిన పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చిత్రం లో చూపించారు. అదే కొత్త వివాదానికి దారితీసింది..
జార్జిరెడ్డి ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఎన్నికల్లో విజయం సాధించడం.. చెరగని ముద్ర వేయడం చూసి తోటి మరో సంఘం విద్యార్థి నాయకులు ఆయనను వలపన్ని హతమార్చడం తెలిసిందే.. అయితే ఇప్పుడు దాన్ని తెరపై చూపించే ప్రయత్నంలో భాగంగా ‘జార్జిరెడ్డి’ పేరు తో సినిమా తీశారు.ఇప్పుడిది రాజకీయ వివాదంగా మారిపోయింది.
సినిమాలపై అభ్యంతరాలు రావడం.. కోర్టులకెక్కి, ఇతర మార్గాల ద్వారా అడ్డుకోవడం కామనే. అయితే తాజాగా 'జార్జి రెడ్డి' మూవీపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పుడు 'జార్జి రెడ్డి' మూవీపై కత్తిగట్టారు. ఈ సినిమా తాజా ట్రైలర్ పై రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 'చిత్రం ప్రోమోలో వన్ సైడ్ గా చూపించారని.. సినిమా ముసుగులో ఏబీవీపీని కించపరిస్తే సహించమని.. అడ్డుకుంటామని హెచ్చరించారు. సినిమాకు సెన్సార్ బోర్డు ఎలా పర్మిషన్ ఇచ్చిందని.. దీనిలోని కొన్ని సీన్లను కట్ చేయాలని స్పష్టం చేశారు.
జార్జి రెడ్డి ట్రైలర్ పై రాజాసింగ్ పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. జార్జిరెడ్డి హత్య కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందని.. ఏబీవీపీ కి చెందిన వ్యక్తులే ఈ హత్య చేశారన్నట్టు గా ఈ సినిమాలో చూపించారని మండిపడ్డారు. అబద్ధాలు చూపిస్తే తాము అడ్డుకుంటామని రాజాసింగ్ స్పష్టం చేశారు. దీనికి 100 రెట్లు మా రియక్షన్ ఉంటుంది అని హెచ్చరించారు.