'లైగర్' సెలబ్రేషన్స్ చూసి ఎమోషనల్ అయిన VD..!

Update: 2021-01-19 10:13 GMT
సెన్సేషనల్ స్టార్ విజయ్‌ దేవరకొండ - డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రానికి ''లైగర్‌'' అనే టైటిల్‌ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విడుదల చేసిన 'లైగర్' ఫస్ట్‌ లుక్‌ కు అమేజింగ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఫస్ట్ లుక్ చూసి వీడీ ఫ్యాన్స్ కేకులు కట్ చేయడంతో పాటు 'లైగర్' అని టాటూస్ వేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. అంతేకాకుండా తమ అభిమాన హీరో ఫస్ట్ లుక్ వచ్చేసిందని 'లైగర్' బ్యానర్ కి వెరైటీగా బీర్ తో అభిషేకం చేశారు వీడీ ఫ్యాన్స్. ఆ వీడియోను ప్రొడ్యూసర్ ఛార్మి తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా షేర్‌ చేస్తూ 'రచ్చ మొదలైంది' అంటూ పోస్ట్‌ చేసింది. దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు.

విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో స్పందిస్తూ.. 'ఓ సమయంలో ఈ సినిమా కోసం తాను పడిన శ్రమను ఎవరైనా గుర్తిస్తారా? అసలు థియేటర్లకు జనం వస్తారా? అని అనుకున్నాను. కానీ ఫ్యాన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉంది' అని పేర్కొన్నాడు. 'నిన్న మీరు నన్ను ఎంతో సంతోషకరమైన భావోద్వేగాల్లో ముంచెత్తారు. 'లైగర్' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశాక సోషల్ మీడియాలో కనిపిస్తున్న దృశ్యాలు నన్ను కదలించాయి' అని విజయ్ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా ''నా మాటలు గుర్తు పెట్టుకోండి - మీరు టీజర్ కోసం వేచి చూడండి.. నేషనల్ వైడ్ మ్యాడ్నెస్‌ కు నేను హామీ ఇస్తున్నాను!'' అని మరో ట్వీట్ చేశారు విజయ్ దేవరకొండ.
Tags:    

Similar News