కేవలం నటిగా నిరూపించుకుంటే సరిపోదు.. తమలో ఉన్న స్పెషాల్టీని ప్రతిసారీ ఏదో ఒక క్రియేటివ్ కోణంలో ఆవిష్కరించుకుని కొత్త తరంతో పోటీపడుతూ ఉంటేనే తదుపరి అవకాశం దక్కుతుంది. ఈ పోటీ రంగంలో ప్రతిభ అందం ఉండీ.. హిట్టు కొట్టినా వెనకబడిన నాయికలున్నారు. అందుకే ఇప్పుడు కీర్తి కాస్త క్రియేటివ్ గా తొలి స్టెప్ తీసుకుంది. చాలా కాలంగా తన కలల ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తూ.. ఇప్పుడు సింగిల్ ఆల్బమ్ తో మైమరిపించేందుకు తన అభిమానుల ముందుకు వచ్చింది.
గాంధారి మ్యూజిక్ వీడియోతో కీర్తి దూసుకొచ్చింది. ఈ వీడియో గురించి ఆన్ లైన్ లో ప్రకటించి ఈ ప్రాజెక్ట్ తన హృదయానికి దగ్గరగా ఉందని చెప్పినప్పటి నుండి దానిపై చాలా అంచనాలు ఉన్నాయి. ఎట్టకేలకు మ్యూజిక్ వీడియో విడుదలైంది. ప్రతిభావంతురాలైన కీర్తి డ్యాన్సుల పరంగానూ అంచనాలకు పూర్తి న్యాయం చేసిందనడంలో సందేహం లేదు.
ఎంతో అందంగా ట్రెడిషనల్ గా కీర్తి ఈ సాంగ్ లో కనిపించింది. తనదైన అమాయకత్వం క్యూట్ నెస్ ఎంతో ఆకర్షించింది. జానపద నృత్యకారిణిగా కీర్తి మరో లెవల్ ఏంటో చూపించింది. ఒక కోణంలో చూస్తే కీర్తిలో నిజంగానే మహానటి సావిత్రి పోలిక కనిపించింది. అంత గొప్ప ట్రెడిషన్ తన ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది.
బృందా మాస్టర్ ఈ మ్యూజిక్ ఆల్బమ్ కి కొరియోగ్రఫీ అందించడమే గాక దర్శకత్వం వహించారు. గాంధారికి పవన్ సిహెచ్ చక్కని సంగీతం అందించారు. సోని మ్యూజిక్ విడుదల చేయగా.. ది రూట్ ఈ వీడియోని రూపొందించింది. సుద్దాల అశోక్ తేజ సరళమైన సాహిత్యం అందించగా.. అనన్య భట్ ఈ పాటను పాడారు.
జాతీయ అవార్డు నటి కీర్తి మొదటి మ్యూజిక్ వీడియో ఇది. తన అభిమానులకు స్పెషల్ ట్రీట్ అనడంలో సందేహం లేదు. గాంధారి ఫినిషింగ్ టచ్ ని కూడా అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. అంతగా కవ్వించే ట్విస్ట్ ఇచ్చింది కీర్తి.
Full View