KGF చాప్టర్ 2 VS బీస్ట్ VS జెర్సీ

Update: 2022-04-05 04:30 GMT
ఈ ఏప్రిల్ వినోదం ప‌రంగా సంథింగ్ స్పెష‌ల్ అని చెప్పాలి. నాలుగు ఇండస్ట్రీల నుంచి నాలుగు పెద్ద సినిమాలు వస్తుండటంతో అభిమానుల్లో ఈ సినిమాల‌పై భారీ అంచనాలు ఏర్ప‌డుతున్నాయి. ఈ నాలుగు చిత్రాల‌పై దాదాపు 1000 కోట్ల మేర బ‌డ్జెట్ల ప‌రంగా బెట్టింగ్ సాగింద‌ని అంచ‌నా. దేశీ చలనచిత్ర పరిశ్రమలో ఇది అరుదైన దృశ్యం.

ఈ ఏప్రిల్ లో బాక్సాఫీస్ వద్ద ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద ఘర్షణ క‌నిపించ‌నుంది. త‌మిళం నుంచి మోస్ట్ అవైటెడ్ బీస్ట్- క‌న్న‌డం నుంచి KGF చాప్టర్ 2 .. హిందీ నుంచి జెర్సీ క్లాష్ అవుతున్నాయి. ఇక ఏప్రిల్ చివ‌రిలో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి- రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టించిన ఆచార్య విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

నాలుగు ఇండస్ట్రీల నుంచి నాలుగు పెద్ద సినిమాలు వస్తుండటంతో టన్నుల కొద్దీ అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ లో బాక్సాఫీస్ వ‌ద్ద బోలెడంత సంద‌డి నెల‌కొన‌నుంది. ఇవ‌న్నీ పాన్-ఇండియన్ సినిమాలు కావ‌డంతో అత్యంత భారీగా రిలీజ్ కానున్నాయి. మాస్ ఎంటర్ టైనర్ లు స్పెష‌ల్ ట్రీటిస్తాయ‌ని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నందున పోటీ అనివార్యంగా మారింది.

ద‌ళ‌పతి విజయ్ వ‌ర్సెస్ యష్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇంత‌లోనే షాహిద్ కపూర్  జెర్సీతో బ‌రిలో దిగాడు. జెర్సీ నిజానికి మాస్ ప్రేక్షకులను సంతృప్తిపరచదు. కానీ కేజీఎఫ్ 2.. బీస్ట్ చిత్రాలు మాస్ ట్రీటిస్తాయ‌న‌డంలో సందేహం లేదు. రెండు వారాల కంటే తక్కువ సమయం మిగిలి ఉన్నందున అంచనాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇవ‌న్నీ పెద్ద బడ్జెట్ చిత్రాలు.. కావ‌డంతో బోలెడంత హైప్ నెల‌కొంది.

యష్ KGF చాప్టర్ 2 ప్రధానంగా కన్నడ చిత్రం  హిందీ- తమిళం- తెలుగు - మలయాళం అలాగే డబ్బింగ్ వెర్షన్లలో ఏప్రిల్ 14న‌ విడుదల కానుంది. కన్నడ చిత్రం అయినప్పటికీ సీక్వెల్ దాని హిందీ - తెలుగు వెర్షన్ లతో కూడా రికార్డు స్థాయిలో దూసుకుపోతుందని భావిస్తున్నారు. అందుకే ఇది ఖచ్చితంగా పాన్-ఇండియన్ చిత్రం. ఇది దాని మొద‌టి భాగం కంటే  అత్యంత భారీగా తెర‌కెక్కింది. సుమారు 200 కోట్ల బడ్జెట్ తో రూపొందించార‌ని టాక్. ఇక జెర్సీ చిత్రానికి 100కోట్లు పైగా బ‌డ్జెట్ వెచ్చించ‌గా.. ఏప్రిల్ 13న విడుద‌ల‌వుతున్న బీస్ట్ ఈ చిత్రానికి ఇంచుమించు అంతే బ‌డ్జెట్ పెట్టారు.

ఈ సినిమా దేశ విదేశాల్లో అత్యంత భారీగా విడుద‌ల‌వుతోంది. ఇక చిరు-చ‌ర‌ణ్‌ న‌టించిన‌ ఆచార్య చిత్రానికి 100 కోట్లు బ‌డ్జెట్ పెట్టార‌ని టాక్ వినిపిస్తోంది. అయితే ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న అంటే మంథ్ ఎండ్ లో విడుద‌ల‌వుతోంది. ఇవ‌న్నీ భారీ వ‌సూళ్ల ల‌క్ష్యంగా బ‌రిలో దిగుతున్నాయి.
Tags:    

Similar News