`బాహుబలి` తరువాత టాలీవుడ్ దశ, దిశ మారినట్టే `ట్రిపుల్ ఆర్` రిలీజ్ తరువాత ఇందులో నటించిన ఇద్దరు స్టార్ ల కోసం భారతీయ సినిమాలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కొమరం భీంగానూ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గానూ రామ్ చరణ్ తమ అద్భుతమైన నటనని ప్రదర్శించారు. దీంతో వీరి పెర్ఫార్మెన్స్ దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు, మేకర్స్ మన స్టార్లపై మనసు పారేసుకుంటున్నారు.
గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ లో `జంజీర్` చిత్రాన్ని చేశారు. ఇదే చరణ్ తొలి హిందీ మూవీ. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీలో చరణ్ పాత్ర, తన నటనపై బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు, మేకర్స్, సెలబ్రిటీలు కూడా షాకింగ్ కామెంట్ లు చేశారు. మెగాస్టార్ కొడుకైతే సరిపోదు ఫేస్ లో ఎక్స్ప్రెషన్ సరిగా పలకరావాలి అంటూ దారుణంగా విమర్శించారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. విమర్శించిన వాళ్లే ఇప్పడు రామరాజు పాత్రలో చరణ్ అభినయాన్ని చూసి షాకవుతున్నారట.
చరణ్ లో అద్భుతమైన నటుడున్నాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ గురించి బాలీవుడ్ సర్కిల్స్ లో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతూ చర్చనీయాంశంగా మారింది. నచ్చితే పొగిడేయడం.. నచ్చకపోతే విమర్శించడంలో ముందుండే బాలీవుడ్ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చరణ్ పై కన్నేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ కు చెందిన స్టార్ ప్రొడక్షన్ కంపనీ స్టార్ డైరెక్టర్ ని రంగంలోకి దింపి చరన్ తో రెండు సినిమాల కోసం బిగ్ డీల్ ని ఆఫర్ చేసిందట.
సదరు సంస్థ ఆఫర్ చేసి మొత్తం అన్ ఇమాజినబుల్ అని అయితే అలాంటి ఆఫర్ ని ఎవరూ వదులు కోరని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ రెండు చిత్రాల్లో ఓ సినిమా మల్టీస్టారర్ అని, అందులో బాలీవుడ్ క్రేజీ ఖాన్ హీరోల్లో ఓ హీరో నటిస్తారని ఆఫర్ ఇచ్చిందట. అయితే చరణ్ మాత్రం ఆ ఆఫర్ కు ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని, ఇవ్వడు కూడా అని తెలుస్తోంది.
ప్రస్తుతం చరణ్ దృష్టి అంతా శంకర్ తో చేస్తున్న సినిమాపైనే వుందని, ఆ తరువాత తెలుగులోనూ పలువురు క్రేజీ డైరెక్టర్ లతో చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయబోతున్నాడు. ఈ లైనప్ ని పక్కన పెట్టి బాలీవుడ్ సంస్థ ఇచ్చిన ఆఫర్ ని చరణ్ ఫైనల్ చేయడం కలే అని టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇదిలా వుంటే చరణ్ - శంకర్ ల మూవీ తాజా షెడ్యూల్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ మూవీలో రెండు విభిన్నమైన పాత్రల్లో చరణ్ కనిపించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా సెకండ్ లుక్ టెస్ట్ ని ఇటీవలే చరణ్ పూర్తి చేశాడని తెలిసింది.