న‌క్స‌లిజం బ్యాక్‌డ్రాపే క‌ల‌వ‌ర‌పెడుతోందా?

Update: 2022-05-04 14:30 GMT
తెలుగు సినిమాకు ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా మంచి మార్కెట్ ఏర్ప‌డింది. అంతే కాకుండా మ‌న సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాయి. దీంతో మ‌న వాళ్లు భారీ చిత్రాల‌తో పాటు కొత్త కొత్త క‌థ‌ల‌ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. అయితే ఈ మ‌ధ్య న‌క్స‌లిజం నేప‌థ్యంలో వ‌స్తున్న సినిమాలు మేక‌ర్స్ ని క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.

కంటెంట్ క‌రెక్ట్ గా లేక‌పోవ‌డం.. వివాదాస్ప‌ద అంశాల‌కు తావివ్వ‌డంతో ఈ త‌ర‌హా నేప‌థ్యంలో వ‌స్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌పోతున్నాయి. గ‌తంలో మాదాల రంగారావు, ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి, దాస‌రి నారాయ‌ణ‌రావు వంటి ద‌ర్శ‌కుల‌కు మాత్రం ఈ నేప‌థ్య చిత్రాలు విజ‌యాల్ని అందించాయి.

మ‌రో ద‌ర్శ‌కుడు ఈ జాన‌ర్ ని ట‌చ్ చేస్తే ఫ్లాపులే ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. తాజాగా ఇదే ఫ‌లితాన్ని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించిన 'ఆచార్య‌' ఎదుర్కొని ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టించినా ఈ మూవీని కాపాడ‌లేక‌పోయారు. క‌థ‌, క‌థ‌నాలు గాడి త‌ప్ప‌డం వ‌ల్లే ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింద‌న్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల వాద‌న‌. న‌క్సలింజం నేప‌థ్యంలో రూపొందిన ఈ మూవీ ఫ్లాప్ కావ‌డంతో అందిరి దృష్టి ఇప్పుడు 'విరాట ప‌ర్వం'పై ప‌డింది. రానా హీరోగా న‌టించిన ఈ మూవీలో సాయి ప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టించింది.

అభ్యుద‌య భావాలున్న ఓ డాక్ట‌ర్ న‌క్స‌లైట్ గా మారి విప్ల‌వ ర‌చ‌న‌లు చేయ‌డం..అత‌ని ర‌చ‌న‌ల‌కు వీరాభిమానిగా మారిన ఓ యువ‌తి త‌న‌ని వెతుక్కుంటూ అడ‌వుల బాట ప‌ట్ట‌డం ఈ క్ర‌మంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల తెర‌కెక్కించారు. ఉత్త‌ర తెలంగాణ‌లో 90 వ ద‌శ‌కంలో జ‌రిగిన న‌క్సలైట్ ఉద్య‌మంలో అసువులు బాసిన ఎంతో మందికి నివాళిగా ఈ చిత్రాన్ని యాద‌ర్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కించారు.

సినిమాని గ‌తేడాది ఏప్రిల్ లో విడుద‌ల చేయాల్సింది. రిలీజ్ డేట్ ని కూడా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కానీ క‌రోనా కార‌ణంగా విడుద‌ల చేయ‌లేదు. ఇంత వ‌ర‌కు ఈ సినిమా రిలీజ్ పై టీమ్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. రానా కూడా స్పందించ‌డం లేదు. సోష‌ల్ మీడియా వేదిక‌గా రానా ని ఈ సినిమాపై ప్ర‌శ్నించినా నో ఆన్స‌ర్‌. సాయి ప‌ల్ల‌వి కూడా సైలెంట్ అయిపోయింది. థియేట‌ర్ల‌లో చిన్న సినిమాల నుంచి పాన్ ఇండియా మూవీస్ సంద‌డి చేస్తున్నాయి, అయినా 'విరాట ప‌ర్వం' నుంచి ఎలాంటి స్పంద‌న లేదు.

దీంతో ఈ సినిమా రిలీజ్ పై ర‌క ర‌కాల వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కొంత మంది అస‌లు ఏం జ‌రుగుతోందంటూ అనుమానాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి నేప‌థ్య‌మే క‌ల‌వ‌ర‌పెడుతోంద‌ని కొంత మంది చెబుతున్నారు. ఇటీవ‌ల ఈ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాలు  అంత‌గా ఆడ‌లేద‌ని, అదే ఇప్ప‌డు విరాట‌ప‌ర్వంని టెన్ష‌న్ పెడుతోంద‌ని అంటున్నారు. ఇదంతా ప‌క్క‌న పెడితే సినిమా ఎందుకు బ‌య‌టికి రావ‌డం లేద‌న్న‌ది మాత్రం ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు.
Tags:    

Similar News