హీరోయిన్ని ఇంటి నుంచి గెంటేశారు

Update: 2017-05-16 11:00 GMT
సన్నీ లియోన్ లాంటి వాళ్లకే కాదు.. ముంబయిలో మామూలు హీరోయిన్లకు కూడా ఇల్లు దొరకడం కష్టంగానే ఉంది. ఒంటరిగా ఉండే హీరోయిన్లంటే జనాలకు ఉండే తప్పుడు అభిప్రాయం వల్ల కొందరు బాలీవుడ్ భామలు గూడు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ సరసన కథానాయికగా నటిస్తున్న నిధి అగర్వాల్ కు ఇలాంటి ఇబ్బంది ఎదురవడం గమనార్హం.

టైగర్ ష్రాఫ్ తో కలిసి నిధి అగర్వాల్ ‘మున్నా మైఖేల్’ అనే సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఆమె ఐశ్వర్యా రాయ్.. శిల్పా శెట్టిల మాదిరే బాలీవుడ్లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిపోవాలని కర్ణాటక నుంచి ముంబైకి వచ్చింది. హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నాక ముంబైలోని బాంద్రా దగ్గర ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ తీసుకుంది. ఐతే కొన్నాళ్ల పాటు ఇబ్బందేమీ లేకపోయింది కానీ.. ఈ మధ్య ఆ అపార్ట్ మెంట్ హౌసింగ్ సొసైటీ వాళ్లకు ఆమెకు షాకిచ్చారు.

ఒంటరిగా ఉన్న నిధి.. వేళ కాని వేళల్లో ప్లాట్ కు వస్తుండటంతో ఇరుగు పొరుగు వారు ఆమె మీద కంప్లైంట్ చేశారట. ఒంటరిగా ఉంటున్న నిధి ఏవైనా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందేమో అని కూడా సందేహించారట. అందుకే వెంటనే ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆమెకు హౌసింగ్ సొసైటీ వాళ్లు తేల్చి చెప్పారట. ఇలా ముంబయిలో సెటిలవుదామని వచ్చిన ఒంటరి అమ్మాయిల పరిస్థితి అంతా ఇలాగే ఉందని... ఇంటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందని నిధి వాపోయింది. సినిమా వాళ్లన్నాక షూటింగ్స్ వల్ల ఏ సమయానికి ఇంటికి చేరుతామో తెలియదని.. అది అర్థం చేసుకోకుండా తమ మీద నిందలేసి ఇలా ఇళ్ల నుంచి వెళ్లగొట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తోంది నిధి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News