కరోనా మహమ్మారీ జనజీవనానికి తీవ్ర ఆటంకంగా మారింది. థర్డ్ వేవ్ ప్రభావంతో రాత్రి కర్ఫ్యూలు ఇబ్బందికరంగా మారాయి. అయితే ప్రజలలకు భారీ ఉపశమనం కలిగిస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేసింది. ఒమిక్రాన్ వేరియంట్ దృష్ట్యా AP ఇంతకుముందు రాత్రిపూట కర్ఫ్యూను విధించింది. ప్రతిరోజూ వేలాది కొత్త కేసులు నమోదవ్వడంతో ఆందోళన పెరగడంతోనే ఈ నిర్ణయం. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో సినిమా హాళ్లలో షో టైమింగ్స్ పైనా దాని ప్రభావం పడింది. నైట్ షో లేకుండా పోయింది.
తాజాగా రాత్రి కర్ఫ్యూలను ఎత్తివేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ప్రజల రోజువారీ జీవితాన్ని సులభతరం చేస్తుంది. వినోదరంగానికి ఇది సాయమవుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు అందరి దృష్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `భీమ్లా నాయక్` విడుదలపై ఉంది. నిజానికి సంక్రాంతి బరిలో రావాల్సిన సినిమా ఇది. RRR బృందం అభ్యర్థనతో ఈ చిత్రం సంక్రాంతి విడుదల నుండి వైదొలిగింది. అయితే ఓమిక్రాన్ అంతా మార్చేసింది. షెడ్యూల్స్ తారుమారయ్యాయి. ఆర్.ఆర్.ఆర్ తో పాటు ఇతర పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి.
ఇప్పుడు నైట్ కర్ఫ్యూ ఎత్తేశారు కాబట్టి.. భీమ్లానాయక్ విడుదల తేదీపై క్లారిటీ ఇస్తారని భావిస్తున్నారు. అయితే కర్ఫ్యూ ఎత్తేసినా వేరొక సమస్య అలానే ఉంది. అదే టికెట్ రేట్ల. ఫిబ్రవరి మూడు లేదా నాలుగో వారంలో టిక్కెట్ ధరలను సవరిస్తూ వైసీపీ ప్రభుత్వం తాజా జీవోను తీసుకురానుంది. ఈ జీవో ఆధారంగా భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ ని ఖరారు చేస్తారు. ప్రస్తుతానికి సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ రిలీజ్ తేదీపై తర్జనభర్జనలో ఉన్నారని తెలిసింది.
కొత్త అప్ డేట్ ఏదీ లేదేం?
`భీమ్లా నాయక్` నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చినా జెట్ స్పీడ్ తో పవన్ - రానా అభిమానుల్లో వైరల్ అయిపోతున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ బరిలో దిగుతున్నాడంటే నెటిజనుల్లో ఎక్కాడా లేని హుషారు వస్తోంది. అంతగా భీమ్లా పాత్రలోకి పవన్ ఒదిగిపోయారు. అలాగే డేనియల్ పాత్రలోకి రానా పరకాయ ప్రవేశం చేసారు. ఇప్పటికే ఆ ఇద్దరి లుక్ లు రిలీజ్ చేయగా అభిమానుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. మోషన్ పోస్టర్లు దూసుకెళ్లాయి.
ది సౌండ్ ఆఫ్ భీమ్లా వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. భీమ్లా నాయక్ థర్డ్ సింగిల్ ప్రజల్లోకి దూసుకెళ్లింది. ఖద్దరు చొక్కా గళ్ల లుంగీ ధరించిన పవన్ విస్కీ బాటిల్ తో బోలెడంత హంగామా చేయడం హైలైట్. ఇక రానా కూడా పవన్ తో పోటీపడుతూ పెద్ద మనిషి పాత్రలో కనిపించనున్నాడు. పవన్ వర్సెస్ రానా ఈగోయిస్టిక్ ఎపిసోడ్స్ ఎంతో అందంగా కుదిరాయని కూడా వెల్లడైంది.