పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తన లేటెస్ట్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ ను హిందీలో రిలీజ్ చేస్తుండడంతో.. బాలీవుడ్ లో ఓ వర్గం నుంచి ఓ రకంగా ఏడుపులు మొదలైపోయాయి. పిచ్చోడి కింద అక్కడి జనాలు, యాక్టర్లు భావించే కమల్ ఆర్ ఖాన్ రీసెంట్ గా పవన్ పై చేసిన ట్వీట్స్ దుమారాన్నే సృష్టించాయి.
ఇలాంటి చిల్లర గాళ్ల వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ ఏ రోజూ పట్టించుకోడు. ఇక పనవ్ నుంచి రియాక్షన్ ఆశించడం కూడా అనవసరమే. కానీ పవర్ స్టార్ ని విపరీతంగా అభిమానించే వాళ్లు మాత్రం కమల్ ను అలా వదిలేయలేకపోతున్నారు. రీసెంట్ గా సంపూర్ణేష్ బాబు.. కమల్ ఖాన్ ని కుక్కపిల్లను చేసి సెటైర్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కుర్ర హీరో నిఖిల్ కూడా.. ఇతగాడిపై ట్వీట్ చేశాడు. 'మిస్టర్ కమల్ ఆర్ ఖాన్.. ఓ ఫూల్. అవమానకరంగా, అభ్యంతరకరంగా ఉన్న ఈ ట్వీట్ ను నేను ట్విట్టర్ కు రిపోర్ట్ చేస్తున్నా. దయచేసి మీరంతా కూడా రిపోర్ట్ చేయండి. పవర్ చూపించండి' అంటూ ట్వీట్ చేశాడు నిఖిల్.
తాజాగా ఈ కమల్ ఖాన్ ఓ సర్వే కూడా చేయించేశానని చెప్పాడు. 24 శాతంమందికి అసలు పవన్ కళ్యాణ్ ఎవరో తెలీదని.. అయినా చాలామంది సూపర్ స్టార్ అని మొరుగుతున్నారని ట్వీట్ చేశాడు. సర్దార్ ని, బాహుబలి ని కంపేర్ చేయడం కరెక్ట్ కాదని.. ప్రభాస్ ఓ సల్మాన్ ఖాన్ అయితే.. రాజ్ పాల్ యాదవ్ లాంటి వాడు పవన్ అంటూ ట్వీట్ చేశాడు కమల్ ఆర్ ఖాన్. ఈ మొత్తం ట్వీట్స్ అన్నిటిపైనా ఇప్పుడు ట్విట్టర్ కి రిపోర్టులు వేల సంఖ్యలో అందుతున్నాయి. ఇతగాడి అకౌంట్ బ్లాక్ కావడమే ఇక లేట్.