లాక్ డౌన్ లో టాలీవుడ్ ప్రముఖుల వెడ్ లాక్ గురించే ఇప్పుడు అందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు. కరానా మహమ్మారి కారణంగా శుభకార్యాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు కూడా భారీ సమూహాలు ఏర్పడే ఫంక్షన్స్ కి అనుమతులు ఇవ్వడం లేదు. అతి తక్కువ మంది సన్నిహితులు బంధువుల మధ్య వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అనుకున్న సుముహార్తానికి కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న వారు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన రెండో వివాహాన్ని కొద్దిమంది ఫ్యామిలీ సభ్యుల మధ్య చేసుకున్నాడు. అంతేకాకుండా యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ వివాహం పల్లవి వర్మతో జరిగిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా వీరి పెళ్లి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. అయితే నిఖిల్ ఈ మధ్య తన పెళ్లి గురించి తెలుపుతూ.. అందరి సమక్షంలోనే పెళ్లి చేసుకుంటానని.. అది ఎప్పుడు వీలైతే అప్పుడే అని తెలిపాడు. పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లుగా తెలిపిన నిఖిల్ సడెన్ గా నిర్ణయం తీసుకుని వెడ్ లాక్ పూర్తి చేశాడు.
ఇక నిఖిల్ దారిలోనే హీరో నితిన్ నడవబోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి నితిన్ కూడా తన గర్ల్ ఫ్రెండ్ షాలిని ని పెళ్లి చేసుకోవాలని అన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాత.. కరోనా మహమ్మారి వచ్చి వారి పెళ్లిని వాయిదా వేసింది. ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్న నితిన్ - షాలిని జంట దుబాయ్లో ఏప్రిల్ 16న డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా దెబ్బతో ప్లాన్ అంతా తారుమారైంది. విదేశాలకు వెళ్లే అవకాశం లేకపోవడం.. కరోనా డేస్ లో పెళ్లి చేసుకొనే ఆలోచన విరమించుకొని వాయిదా వేసుకున్నారు. నిఖిల్ పెళ్లి జరిగిపోవడంతో నితిన్ పెళ్ళెప్పుడు అంటూ అందరూ ఆలోచిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం నితిన్ తన వివాహాన్ని డిసెంబర్ కు వాయిదా వేసినట్టు తెలిసింది. బంధువులు సన్నిహితులు సమక్షంలోనే నితిన్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడట. ఈ ఏడాది చివరికి కరోనా కంట్రోల్ కి వచ్చే అవకాశం ఉందని.. అందరూ పెళ్ళికి వస్తారని డిసెంబర్ లో అనుకుంటున్నారట. త్వరలోనే దీనిపై నితిన్ ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా దగ్గుబాటి రానా వివాహం కూడా డిసెంబర్ లో జరపాలనుకుంటున్నట్లు సురేష్ బాబు వెల్లడించిన విషయం తెలిసిందే.