ఇప్పుడొస్తున్న యంగ్ హీరోలందరూ.. అయితే పోలీస్.. లేకపోతే కాలేజ్ స్టూడెంట్.. ఈ రెండు పాత్రల్లో అదేదో యూత్ అంట.. యాక్షన్ అంట.. హీరోయిజమ్ అంట.. ఇలా ఏవేవో చూపించేస్తున్నారు. కాని ఒక్కోసారి మాత్రం అరుదైన పాత్రలు చేయడానికి ఒప్పుకుంటున్నారు. అదిగో ''తీన్మార్'' సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక వంటోడి పాత్రలో.. అదేనండీ చెఫ్ పాత్రలో.. మెరిసాడుగా.. గుర్తుందా? యస్.. మైఖేల్ వేలాయుదమ్ క్యారెక్టర్ ఉంది చూశారూ.. సేమ్ టు సేమ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా అదే దించుతున్నాడు.
''అ..ఆ'' సినిమాలో నితిన్ కూడా ఒక చెఫ్ పాత్రలో నటిస్తున్నాడు. అసలు మనోడు స్పెయిన్ లో ''హార్ట్ ఎటాక్'' సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే.. ఫోన్ చేసి త్రివిక్రమ్ ఈ సినిమా కథను చెప్పాడట. అప్పుడే తెగ నచ్చేసిందట. అయితే కొన్ని అవాంతరాల వలన.. సినిమాను పట్టాలెక్కించడానికి దాదాపు 1 ఇయర్ పట్టేసిందని నితిన్ చెబుతున్నాడు. ఈ సినిమాలో నితిన్ హీరోనా.. సమంత హీరోనా.. అని అడిగితే.. అసలు హీరో త్రివిక్రమ్ గారండీ బాబూ అంటూ నవ్వేశాడు.
''ఈ పద్నాలుగు సంవత్సరాల్లో నేను చేసిన 22 సినిమాలు ఒకెత్తయితే.. అ..ఆ ఒకెత్తు. నా యాక్టింగ్.. డిక్షన్.. బాడీ లాంగ్వేజ్.. చివరకు హెయిర్ స్టయిల్ కూడా కొత్తగా ఉంటుంది. ఇలాంటి పాత్రను చేయడం ఆనందంగా ఉంది. ఇదొక ప్రేమ కథ కమ్ ఫ్యామిలీ డ్రామా. త్రివిక్రమ్ గారికి పెద్ద థ్యాంక్స్'' చెబుతున్నా అంటూ ముగించాడు నితిన్.