యూత్ స్టార్ నితిన్ కి ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రాలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నితిన్ కి అసాధారణ ఫాలోవర్స్ ఉన్నారు. తొలి పరిచయ చిత్రం `జయం`ని బ్లాక్ బస్టర్ చేయడం నుంచి అతడి సినిమాలకు ఈ ఏరియా కలెక్షన్లు ఎంతగానో ప్లస్ అయ్యాయి.
అందుకే ప్రతిసారీ నితిన్ వైజాగ్ లో తన సినిమాల ఈవెంట్లను కచ్ఛితంగా ప్లాన్ చేస్తుంటారు. అతడి ఈవెంట్లకు అక్కడ అభిమానుల నుంచి అద్భుత స్పందన వస్తుంటుంది.
కానీ ఈసారి వైజాగ్ ఈవెంట్ ని నితిన్ స్కిప్ కొట్టాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నితిన్ -కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితారా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మించిన `రంగ్ దే` మార్చి 26 న విడుదల కానుంది. రిలీజ్ తేదీ దగ్గరపడుతోంది కాబట్టి ఇకపై టీమ్ ప్రచారంలో నిమగ్నం కానుంది. ఇప్పటికే ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ బృందం తెలుగు రాష్ట్రాలలో పర్యటించేందుకు రెడీ అవుతోంది. ఆంధ్ర- తెలంగాణ- రాయలసీమలో మూడు భారీ ఈవెంట్లను ప్లాన్ చేశారని తెలిసింది.
హైదరాబాద్ లో ఒక ఈవెంట్ ప్లాన్ చేయగా.. రాజమండ్రి- కర్నూలు లోనూ మరో రెండు బారీ ఈవెంట్లను ప్లాన్ చేశారు. అలా ఆంధ్రా- రాయలసీమ ప్రాంతాల ప్రచార కార్యక్రమాలను డిజైన్ చేశారు. మూడు ఫంక్షన్ల తేదీలు ఏవి..? వేదికలు ఎక్కడ? అన్నది త్వరలో టీమ్ వెల్లడించనుంది. అయితే ఈ జాబితాలో ఎంతో కీలకమైన వైజాగ్ కి ప్రాధాన్యతనివ్వకపోవడం ఉత్తరాంధ్ర అభిమానుల్ని నిరాశపరుస్తుందనడంలో సందేహమేం లేదు. మరి దీనికి నితిన్ ఆన్సర్ ఎలా ఉంటుందో చూడాలి.