నిన్న జరిగిన అ!! ప్రీ రిలీజ్ ఫంక్షన్ సింపుల్ గా అనిపించినా అందులో స్టార్ కాస్ట్ మొత్తం రావడంతో కళకళలాడింది. నిర్మాతగా నాని తాను నటించకుండా తీస్తున్న మూవీ కావడంతో సహజంగానే అందరికి దీని మీద ఆసక్తి మళ్ళింది . పైగా ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని ఇప్పటి ట్రైలర్ దాకా ప్రతి దాంట్లోనూ వైవిధ్యం చూపించిన తీరు రెగ్యులర్ ఆడియన్స్ ని సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. నిర్మాతగా దీంట్లో తనది పెద్ద బాధ్యత కాబట్టి నాని దాన్ని పూర్తిగా నిర్వర్తించాడు. ఇందులో భాగంగా నిత్య మీనన్ గురించి చెబుతూ పొగుడుతున్నప్పుడు నిత్య తను కూర్చున్న చోటు నుంచే ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం ఎవరి దృష్టి దాటిపోలేదు. దీని గురించి కొందరు అత్యుత్సాహవంతులు ఏవేవో అల్లే ప్రయత్నం చేసారు కాని నిజానికి నిత్య తనకు ఈ పాత్ర ఆఫర్ చెసినందుకు కృతజ్ఞత కూడిన ప్రేమను ఆ విధంగా వ్యక్తపరిచిందే తప్ప ఇంకే అర్థమూ లేదు.
నిత్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన నాని ఇందులో తన పాత్ర తీరుతెన్నులు ఎవరు ఊహించని విధంగా ఉంటాయని, ఇలాంటి పాత్ర చేయడానికి ధైర్యం ఉండాలని, నిత్య తప్ప వేరొకరు ఇది చేసేందుకు సాహసిస్తారు అని కూడా అనుకోనని నాని తనను మోసేయడంతో నిత్య అలా గాల్లో ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. అంత స్పెషల్ పాత్ర ఏమి ఉంటుందా అని అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. తెలిసిన సమాచారం మేరకు ఇందులో నిత్య మీనన్ పాత్ర లెస్బియన్ తరహాలో ఉంటుందట. కథలో కీలక మలుపుకు కారణమయ్యే ఆ పాత్రలో నిత్య జీవించిందని ఇన్ సైడ్ టాక్. అందుకే నాని అంత స్పెషల్ గా పొగిడాడని అనుకోవచ్చు. ఫిబ్రవరి 16న విడుదల కానున్న అ!! సినిమా అంచనాలు ట్రైలర్ చూసాక అమాంతం పెరిగిపోయాయి. మాస్ మర్డర్ కాన్సెప్ట్ తో కేఫెటేరియా నేపధ్యంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ దీన్ని తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది.