నానిపై అభిమానం ఎలా చాటుకొందంటే?
ఆ హీరోయిన్ ని లేడీ కమల్ హాసన్ అంటాడు నాని. ఆమేమో కమల్ తర్వాత నాకు ఇష్టమైన నటుడు నానినే అంటుంది. ఒకరి నటనని మరొకరు అంతగా పొగుడుకునే ఆ ఇద్దరూ ఇటీవల జంటిల్ మన్ లో కలిసి నటించారు. ఆ హీరోయిన్ ఎవరో ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. అవును... నివేదా థామసే. నాని - నివేదా ఇప్పుడు జంటిల్ మన్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాట్రిక్ కొట్టానన్న ఆనందంలో నాని ఉండగా, తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు చూరగొన్నానని నివేదా ఖుషీగా గడుపుతోంది. నివేదాకి అప్పుడే తెలుగు నుంచి బోలెడన్ని ఆఫర్లు వస్తున్నాయట.
అయితే తనకు ఇష్టమైన నానిపై ఇటీవల నివేదా ప్రత్యేకంగా అభిమానం చాటుకొంది. స్వతహాగా ఆర్టిస్టు అయిన నివేదా స్వహస్తాలతో నాని బొమ్మని పెయింట్ వేసింది. అది కూడా జంటిల్ మన్ లో విలన్ గా - హీరోగా కనిపించిన రెండు లుక్స్ ని పెయింట్ గా వేసి నానికి అందజేసింది. ఒక హీరోయిన్ నుంచి అలాంటి గిఫ్టు అందడంతో నాని ఆనందానికి అవధుల్లేవు. ఇంట్లో ఓ ప్రత్యేకమైన ప్లేస్ లో ఆ పెయింటింగ్ ని పెట్టుకొన్నాడట. ట్విట్టర్ లోనూ నివేదా ఇచ్చిన బహుమతి అంటూ ప్రకటించాడు నాని.