రామ్ చరణ్ అండ్ సుకుమార్ కాంబినేషన్ సినిమా ''రంగస్థలం 1985'' షూటింగ్ పల్లె ప్రకృతి సాక్షిగా జరుపుకుంది. 1980లలో ఒక పల్లెటూరులో జరిగే ప్రేమ కథ చెప్పబోతున్నారు ఈ సినిమా ద్వారా. అయితే గోదావరిలో ఒక మారుమూల కుగ్రామంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ టైములో.. ఏకంగా ఒక వారంపాటు యునిట్ అందరికీ ఫోన్లే లేవు తెలుసా.
వెస్ట్ గోదావరిలో ‘శివగిరి’ అనే ఊరులో కనీస సదుపాయాలు కూడా లేని ఒక ప్రాంతంలో ఒక పాట షూట్ చేయడానికి వెళ్లారు రంగస్థలం టీమ్. అక్కడే కొద్ది రోజులు ఉండవలిసి ఉంటుంది కాబట్టి చిన్న చిన్న గుడిసెలు నిర్మించారు. ఇటు చరణ్ అయినా.. అటు హీరోయిన్ సమంత అయినా.. లేదంటే యాంకర్ అనసూయ అయినా.. ఫోన్ లేకుండానే ఒక వారంపాటు టైమ్ స్పెండ్ చేయాల్సి వచ్చింది. ''మరోసారి ఇటువంటి ప్రదేశంలో షూటింగ్ చేస్తానో చేయనో తెలియదు కాని.. చివరకు ఈ షూటింగ్ జ్ఞాపకాలు అద్భుతంగా ఉన్నాయి'' అంటోంది సమంత. ఇక సినిమాలో పనిచేసిన ఇతర సీనియర్లు అయితే. ''ఈ సినిమా ద్వారా మళ్ళీ మాకు పాతకాలంలో ఉన్న ఆ తేటధనం గుర్తు చేశారు. సెట్ కానీ తీసే పాట కానీ అన్నీ పల్లె వాతావరణాన్నికి దగ్గరలో ఉన్నాయి. చాలా బాగుంది'' అంటూ చెబుతున్నారు.
అసలు అంత మారుమూల షూటింగ్ చేస్తున్నా.. కమ్యూనికేషన్ అంటూ ఏమి లేకపోయినా దగ్గరలో ఉన్న జనాలుకు ఎలా తెలిసిందో కాని ఇక్కడ షూటింగ్ జరుగుతుందని.. వారు మాత్రం తండోపతండాలు వచ్చేశారు. అది హైలైట్ అనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/