స్మార్ట్ శంకర్ కు ఆ భయాలేమి లేవా ?

Update: 2019-07-06 08:38 GMT
పూరి జగన్నాధ్ హీరో రామ్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ ఇంకో పది రోజుల్లో విడుదల కానుంది. ఇప్పటికే మూడు ఆడియో సింగిల్స్ ట్రైలర్ ఆన్ లైన్ లో హంగామా చేస్తుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో దాన్ని ఇంకాస్త పీక్స్ కి తీసుకెళ్లబోతున్నారు. ట్రైలర్ వచ్చాక ఇది హాలీవుడ్ మూవీ క్రిమినల్ నుంచి ఇన్స్ ఫైర్ అయ్యిందని ఒకరు లేదు కొరియన్ సినిమా ఐబాయ్ నుంచి ప్లాట్ ను తీసుకున్నారని మరొకరు ఇలా రకరకాలుగా దీని మీద సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇందులో నిజానిజాలు బయటపడేది విడుదల రోజే కానీ అప్పటిదాకా ఈ ప్రచారాల ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది.ఇప్పుడు ఈ రెండు సినిమాలకు ఆన్ లైన్ లో వ్యూస్ పెరుగుతున్నాయట. ఐ బాయ్ అఫీషియల్ గానే నెట్ ఫ్లిక్స్ లో దొరుకుతోంది. క్రిమినల్ సినిమాను పట్టుకోవడం పెద్ద కష్టమేమి లేదు. సో ట్రైలర్ తో కంటెంట్ ని మ్యాచ్ చేసి చూసుకోవడానికి ఈ రెండింటి మీద ఓ లుక్ వేస్తే చాలు.

విదేశీ సినిమాలు రెగ్యులర్ గా చూసే అలవాటు ఉన్న వాళ్లకు ఇదేమి పెద్ద సమస్య కాదు. ఎప్పుడో చూసుంటారు కాబట్టి వాళ్లకు అవగాహనా ఉంటుంది. అయినా కాపీ కొట్టినా హక్కులు కొన్నా స్ఫూర్తి తీసుకున్నా ప్రేక్షకులను మెప్పిస్తే చాలు హిట్ కొట్టొచ్చని ఓ బేబీ నిన్నే ప్రూవ్ చేసింది కదా. మరి ఐస్మార్ట్ శంకర్ సంగతేంటో తేలాలంటే ఇంకో రెండు వారాలు ఆగాల్సిందే. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఇస్మార్ట్ శంకర్ లో నిధి అగర్వాల్ నభ నటేష్ హీరొయిన్లుగా నటిస్తున్నారు


Tags:    

Similar News