డైరెక్ట‌ర్ కి సినిమాల్లేవ్.. తెలిసినోళ్ల‌తో గొడ‌వ‌లు

Update: 2020-01-27 06:43 GMT
రంగుల ప్ర‌పంచం లో ఎప్పుడు ఎవ‌రి టైమ్ ఎలా ఉంటుందో చెప్ప‌లేం. ఇక్క‌డ అంతా మిథ్య‌. ఏదో సాధించేశాం అనుకుంటే త‌ప్పులో అడుగేసిన‌ట్టే. కొంద‌రు దర్శ‌కులు ఇలానే ఏళ్ల‌కు ఏళ్లు కాలం వెల్ల‌దీస్తుంటారు. ఏదో ఒక సినిమా తీసి లేదా మూడు నాలుగు సినిమాలు తీసి ద‌ర్శ‌కుడు అన్న బోర్డ్ మెడ‌లో వేసుకుని తిరిగేస్తుంటారు.

అయితే అలాంటి ఓ ద‌ర్శ‌కుడికి ఇప్పుడు చెయ్య‌డానికి సినిమాల్లేవ్.. తెలిసిన హీరోలంద‌రితో గొడ‌వ‌లున్నాయి.. క‌నీసం ఈవెంట్ల‌ కు కూడా ఎవ‌రూ పిల‌వ‌డం లేదు. ప్చ్ .. యంగ్ హీరోలు కూడా క‌నీసం ఎవ‌రూ ఛాన్సులివ్వ‌డం లేదు. అందుకే అత‌డు ట్విట్ట‌ర్ తో స్నేహం చేశాడు. అక్క‌డ యాక్టివ్ గా ఉంటూ తెలిసీ తెలియ‌నివి కూస్తున్నాడు. దీంతో అవి చ‌దివే వాళ్ల‌కు కంప‌రం ఎక్కుతోంద‌ట‌.

ఇక ఒకే ఒక్క అవ‌కాశం మాత్ర‌మే అత‌డికి ఉంది. అది కూడా పారితోషికం అన్న మాట లేకుండా శాల‌రీ ప‌ద్ధ‌తిలో. ``శాల‌రీ ఇస్తాను.. స్క్రిప్టు సిట్టింగ్స్ లో కూచోమని నిర్మాత దిల్ రాజు అత‌డికి ఖ‌రాఖండిగా తేల్చి చెప్పేశార‌ట‌. అయితే అలా ప‌ని చేయాలంటే అత‌డికి ఏదైనా నామోషీ ఉందా? అన్న‌ది మ‌న‌కు తెలీనిది. ప్ర‌స్తుతం ఒకే ఒక్క ఛాన్స్ అత‌డికి కావాలి. అందివ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని త‌దుప‌రి ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకోవాలి. మ‌రి ఆ ప‌ని చేస్తాడా లేదా అన్న‌ది అత‌డికే తెలియాలి మ‌రి. గొడ‌వ‌లున్న‌ప్పుడు .. స్నేహాలు క‌రువైన‌ప్పుడు కొన్నిసార్లు రాజీకి రావాల్సి ఉంటుంది. ప‌రిశ్ర‌మ‌లో క్యారెక్ట‌ర్ ని నిశితంగా ప‌రిశీలించి ఛాన్సులిస్తుంటారు. గొడ‌వ‌లుంటే చాలా క‌ష్టం. అందుకే కాస్త రాజీకి రావాలి. వీరాధి వీరులే ర‌ణ‌రంగం లో అశ్వథ్థామ హతః కుంజర.. అన్నారు క‌దా! అలా చేయాల్సి ఉంటుంది మ‌రి.
Tags:    

Similar News