#NTR27.. పెద్ద ఎన్టీఆర్ పక్కనే ఎన్టీఆర్

Update: 2017-02-10 05:54 GMT
గత సెప్టెంబర్ లో జనతా గ్యారేజ్ మూవీతో సక్సెస్ సాధించిన జూనియర్ ఎన్టీఆర్.. కొత్త సినిమా ప్రారంభించేశాడు. ఇవాళ అధికారికంగా యంగ్ టైగర్ కొత్త మూవీ షూటింగ్ ప్రారంభమైంది. బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి.. ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

దేవుళ్ల పటాలపై తీసిన మొదటి షాట్ కు ఎన్టీఆర్ స్వయంగా తొలి క్లాప్ కొట్టగా.. పక్కనే సీనియర్ ఎన్టీఆర్ నిలువెత్తు ఫోటోను ఏర్పాటు చేయడం విశేషం. దర్శకుడు బాబీకి వివి వినాయక్ స్క్రిప్ట్ అందించగా.. ఈ పూజా కార్యక్రమాలకు నందమూరి హరికృష్ణ.. నందమూరి రామకృష్ణలు హాజరయ్యారు. ఇవాళ తొలిషాట్ షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభించనున్నారు.

జై లవ కుశ అనే వర్కింగ్ టైటిల్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాశి ఖన్నా.. నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. వీరిద్దరూ ఎన్టీఆర్ తో తొలిసారి నటిస్తుండడం విశేషం. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు టాప్ లీగ్ లోని స్టార్ హీరోతో సినిమా చేయడం కూడా ఇదే మొదటిసారి. మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. ఆగస్ట్ 11న రిలీజ్ చేయాలనే లక్ష్యంతో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నాడు నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News