నాన్న గురించి ఆ రోజు ఎన్టీఆర్ ఏమన్నాడు?

Update: 2018-08-30 06:01 GMT
నందమూరి హరికృష్ణ మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనాల్ని కలచివేసింది. ఆయన తనయులు జూనియర్ ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ ల పరిస్థితి చూసి అందరూ ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్నతనంలో నందమూరి కుటుంబం నుంచి ఆశించిన స్థాయిలో ఆదరవు పొందని జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎక్కువగా ఫీలవుతున్నారు జనాలు. తండ్రీ కొడుకుల కథతో 'నాన్నకు ప్రేమతో' సినిమా చేసిన తారక్.. ఆ చిత్ర ఆడియో వేడుకలో తన తండ్రి గురించి చాలా ఉద్వేగంగా మాట్లాడిన మాటల్ని అభిమానలు ఇప్పుడు గుర్తు చేసుకుని మరింతగా ఆవేదన చెందుతున్నారు. అసలు తండ్రుల గురించి.. తన తండ్రి హరికృష్ణ గురించి ఆ రోజు తారక్ ఏమన్నాడంటే..

"నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నాకు ధైర్యం చెప్పి, వెన్ను తట్టి పంపి.. నా మీద నాకు నమ్మకం కలిగేలా చేసింది మా నాన్నగారు నందమూరి హరికృష్ణ గారు. నాన్న ఎప్పుడూ మా ముగ్గురు సోదరులకీ ఒకటే చెప్పేవారు. 'కింద పడండి.. చావుదాకా వెళ్లిపోండి. కానీ, మిమ్మల్ని మీరు నమ్ముకుని పైకి రండి' అని చెప్పారు. ఆయన ఏ రోజూ పిరికి పందల్లా బతకడం మాకు నేర్పించలేదు. ఆయన పేరు, తాతగారి పేరు చెప్పుకొని బతకడం నేర్పలేదు. 'మీకు మీరుగా బతకండి. మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి' అనేవారు. ఇది సుకుమార్‌ నాన్న గారి కథ. ఈ కథ చెప్పినప్పుడు భయపడ్డా. మా నాన్నకు ఏదైనా అయిపోతుందంటే నేను ఊహించుకోలేను. మనిషిని మామూలుగా ఉండలేను. అలాంటిది ఆయనకున్న బాధను దిగమింగుకొని వాళ్ల నాన్నకు నివాళిగా ఈ కథ రాశారు. నేను ఈ సినిమా కోసం స్పెయిన్‌ లో ఉండగా దేవిశ్రీ ప్రసాద్‌ తండ్రి చనిపోయారు. అప్పుడు నేను దేవికి మెస్సేజ్‌ పెడితే.. రిప్లై వచ్చింది. అంత బాధలోనూ ‘డోంట్‌ గెట్‌ యు స్టాప్‌’ అనే పాటను రఘు దీక్షిత్‌ తో పాడించినట్లు చెప్పాడు. ఆయన కమిట్మెంట్ కు హ్యాట్సాఫ్. దేవీని ఏడిపించినిందుకు సారీ. ఈ చిత్రానికి పని చేసిన అందరం నాన్న పిచ్చోళ్లం’’ అని తారక్ చెప్పాడు ఆ రోజు.
Tags:    

Similar News