ఫస్ట్ లుక్: ఎన్టీఆర్ అప్పీ ఫిజ్ అదిరిపోయిందిగా

Update: 2019-02-21 14:23 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు భారీ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ సైన్ చేయడంలో చాలా జాగ్రత్త వహిస్తాడు. ఆచితూచి బ్రాండ్స్ ను ఎంపిక చేసుకుంటాడు.  తాజాగా ఎన్టీఆర్ పార్లే ఆగ్రో వారితో ఒక భారీ డీల్ సైన్ చేశాడు.  ఈ డీల్ లో భాగంగా అప్పీ ఫిజ్ సాఫ్ట్ డ్రింక్ ను తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తాడు.   

తాజాగా ఈ యాడ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి "అప్పీ ఫిజ్ తో కలిసినందుకు సంతోషంగా ఉంది #ఫీల్ ది ఫిజ్" అంటూ ట్వీట్ చేశాడు.  ఒక రెడ్ కలర్ చైర్ మీద కూర్చొని ఉన్న ఎన్టీఆర్ 'ది ఫిజ్జీ టైమ్స్' న్యూస్ పేపర్ చదువుతున్నాడు. అందులో ఈ బ్రాండ్ ను నార్త్ లో ప్రచారం చేస్తున్న సల్మాన్ ఖాన్ ఫోటో ఉంది.   వైట్ టీ షర్టు.. బ్లాక్ కలర్ స్ట్రిప్ ఉన్న రెడ్ కలర్ జాకెట్.. బ్లాక్ ప్యాంట్స్ ధరించి సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు. న్యూ హెయిర్ స్టైల్.. గెడ్డం మీసం.. అబ్బో స్టైల్ అంతా జూనియర్ దగ్గరే ఉంది.  కానీ ఆయన చూపు మాత్రం పక్కనున్న ఫిజ్ పై ఉంది.

ఎన్టీఆర్ ఈ బ్రాండ్ తో పాటుగా నవరత్న ఆయిల్.. మలబార్ గోల్డ్.. సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ బ్రాండ్లకు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.  సినిమాల విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో #RRR లో నటిస్తున్నాడు.  వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    

Similar News