ఎన్టీఆర్ కి 'పవర్'ఫుల్ స్టోరీ

Update: 2016-11-23 03:52 GMT
జనతా బ్లాక్ బస్టర్ హిట్ కావడం..  సక్సెస్ లతో హ్యాట్రిక్ కంప్లీట్ చేయడంతో.. ఎన్టీఆర్ బాగా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడనే విషయం అర్ధమవుతోంది. వరుసగా చిన్నా పెద్దా ఏ డైరెక్టర్ కథలు చెప్పినా వినేస్తున్నాడు కానీ.. ఊ అనే ఒక్కమాట మాత్రం రావడం లేదు. చాలా మంది దర్శకులు చెప్పిన స్టోరీలతో శాటిస్ఫై కాని ఎన్టీఆర్ కి.. ఇప్పుడు పవర్ తో అరంగేట్రం చేసి.. సర్దార్ గబ్బర్ సింగ్ తో మాయమైపోయిన డైరెక్టర్ బాబీ ఓ కథ చెప్పాడట.

కొన్ని నెలల పాటు రవితేజతో సినిమా కోసం బాబీ వర్క్ చేశాడు కానీ.. బడ్జెట్ సమస్యలతో ఆ మూవీ ఆగిపోయింది. రీసెంట్ ఎన్టీఆర్ ను కలిసిన కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ.. ఓ పవర్ ఫుల్ యాక్షన్ స్టోరీ వినిపించాడట. ఇది రవితేజకు చెప్పిన కథ కాదని.. ఎన్టీఆర్ కోసం పూర్తిగా కొత్తదైన స్టోరీని సిద్ధం చేశాడని తెలుస్తోంది. జనతా గ్యారేజ్ లాంటి మూవీ తర్వాత.. యాక్షన్ ఎంటర్టెయినర్ అంటే కరెక్ట్ ఆప్షన్ అవుతుందనే ఉద్దేశ్యంతో.. ఎన్టీఆర్ కూడా ఇంట్రెస్ట్ చూపించినట్లుగా తెలుస్తోంది.

పూర్తి స్క్రిప్ట్ తో రమ్మని చెప్పిన యంగ్ టైగర్.. అప్పుడు మాత్రమే ఫైనల్ డెసిషన్ తీసుకోగలనని చెప్పడంతో.. ప్రస్తుతం బాబీ అదే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఇలా ఎన్టీఆర్ కోసం బౌండ్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్న రైటర్-డైరెక్టర్లు ఇద్దరు ముగ్గురు ఉండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News