ఇజ్రాయిల్ వార్త పత్రిక లో మన కొమురం భీముడు

Update: 2022-06-18 07:31 GMT
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ఎల్లలు దాటి విదేశాల్లో కూడా సందడి చేస్తోంది. ఇంకా కూడా ఈ సినిమా హడావుడి తగ్గలేదు. ఇక్కడ విడుదల అయ్యి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికి కూడా ఏదో ఒక దేశంలో విడుదల అవుతూ వార్తల్లో ఉంటుంది. సాధారణంగా మన సినిమాలు విదేశాల్లో విడుదల అయితే అక్కడి మీడియా పెద్దగా పట్టించుకోదు.

అక్కడ కొందరు జనాలు మాత్రమే మన సినిమాలు చూస్తారు. కాని ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ఏ దేశంలో విడుదల అయినా ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. ఆయా దేశాల సోషల్‌ మీడియా తో పాటు మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాల్లో కూడా సినిమాకు సంబంధించిన వార్తలు ప్రచురితం అవుతున్నాయి.. ప్రచారం అవుతున్నాయి. తాజాగా ఇజ్రాయిల్‌ కు చెందిన ఒక వార్త పత్రికలో ఆర్ ఆర్ ఆర్ లోని ఎన్టీఆర్‌ పాత్ర గురించి ప్రముఖంగా కథనం వచ్చింది.

ఇజ్రాయిల్‌ కు చెందిన సదరు వార్త పత్రిక లో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ యొక్క నటన మరియు ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ గురించి ప్రధానంగా చర్చించడం జరిగింది. ఏదో చిన్న కాలమ్‌ మ్యాటర్ కాకుండా చాలా పెద్ద కథనంనే సినిమా గురించి మరియు ఎన్టీఆర్‌ గురించి రాయడం జరిగింది.

సినిమాలోని ఎన్టీఆర్‌ రెండు ఫోటోలను కూడా సదరు వార్తా పత్రికలో వేశారు. ఈ కథనం పూర్తిగా ఎన్టీఆర్‌ పాత్ర చుట్టు.. ఆయన నటన చుట్టు తిరిగింది. దాంతో నందమూరి అభిమానులు ఈ పేపర్ కట్టింగ్‌ ను సోషల్‌ మీడియాలో తెగ సర్క్యులేట్‌ చేస్తున్నారు. ఇజ్రాయిల్ లో ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ను భారీ ఎత్తున జనాలు చూస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.

రాజమౌళి సినిమా అంటే కేవలం తెలుగు లో లేదా సౌత్‌ ఇండియా లో లేదా ఇండియా వరకే పరిమితం కాకుండా పదుల దేశాల్లో సత్తా చాటుతుంది అంటూ మరోసారి నిరూపితం అయ్యింది.

ఎన్టీఆర్‌ కూడా నటన విషయంలో తనకు పోటీ.. సాటి మరెవ్వరు లేరు అన్నట్లుగా ఈ సినిమా తో నిరూపించాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News