ఎక్స్ క్లూజివ్ - జూనియ‌ర్ య‌న్టీఆర్ జైల‌వ‌కుశ స్టోరీ

Update: 2017-07-30 06:50 GMT
తార‌క్ ఫ్యాన్స్ లో రోజు రోజుకి అంచ‌నాలు పెంచేస్తున్న జైల‌వ‌కుశకి సంబంధించిన ఓ హాట్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ న‌గ‌ర్ లో షికార్లు కొడుతుంది. జైల‌వ‌కుశ స్టోరీ ఇదే అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కి ఫిల్మ్ స‌ర్కిల్స్ చెబుతున్న ప్ర‌కారం జైల‌వ‌కుశ క‌థ ఏంటంటే, ఇద్ద‌రు క‌వ‌ల సోద‌రులు - వారిని చంపేందుకు తిరిగే ఓ అన్న - ఈ ముగ్గురుకి ఒకే తండ్రి కానీ ఇద్ద‌రు త‌ల్ల‌లు. ఇందులో మొద‌టి భార్య‌కు పుట్టిన వాడే జై. రెండో భార్య‌కు పుట్టిన వారు జైల‌వ‌కుశ‌.

అయితే తండ్రి వ‌ల్లే త‌న త‌ల్లి చ‌నిపోయింద‌ని, ఎలాగైన తండ్రిని అత‌డి కుటుంబాన్ని నాశ‌నం చేయాల‌ని జై అనుకుంటూ ఉంటాడు. అలానే చిన్న‌ప్పుడే తండ్రి త‌న‌ని వ‌దిలి వెళ్లిపోవ‌డంతో జై చెడు సావాశాల‌తో పెద్ద గ్యాంగ్ స్ట‌ర్ గా మారిపోతాడు, మ‌రోవైపున తండ్రితోనే ఉంటూ ల‌వ‌కుశ డ్రామా ఆర్టిస్టులుగా జీవిస్తుంటారు. ఇలా డ్రామాలు వేసే త‌మ్ముళ్ల‌కి, రౌడీయిజం చేసే అన్న‌య్య‌కి మ‌ధ్య న‌డిచే ఓ కామెడీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా జై ల‌వ‌కుశ‌ని తీర్చిదిద్దేందుకు చిత్ర బృందం ప్ర‌య‌త్నిస్తుంద‌ని స‌మాచారం.

ఇక ఈ సినిమాలో య‌న్టీఆర్ త్రిపాత్రాభిన‌యం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంద‌ని చిత్ర బృందం చెబుతోంది. అలానే పోసాని కృష్ణ ముర‌ళి ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు, దాదాపు సినిమా మొత్తం పోసాని పాత్ర చుట్టూనే తిరుగుతుంద‌ని తెలిసింది. మ‌రి ఈ క‌థ అభిమానుల్ని అంచ‌నాల్ని ఏ రీతిన చేరుకుంటుందో చూడాలి.


Tags:    

Similar News