‘జై లవకుశ’ వాయిదా అంటూ రూమర్లు అలా బయటికొచ్చాయో లేదో.. ఈ చిత్ర నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ అలెర్ట్ అయిపోయాడు. తమ సినిమాను వాయిదా వేసే సమస్యే లేదని.. అనుకున్న ప్రకారమే సెప్టెంబరు 21న ‘జై లవకుశ’ వస్తోందని తమ బేనర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు. రిలీజ్ విషయంలో ఉన్న సందేహాలపై మరింత క్లారిటీ ఇచ్చేందుకు ఇప్పుడు ఈ చిత్రం బృందం నుంచి ఇంకో కొత్త సమాచారం బయటికి వచ్చింది. ‘జై లవకుశ’ టాకీ పార్ట్ మొత్తం పూర్తయిపోయినట్లు అప్ డేట్ ఇచ్చింది. ఇక రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందట. ఆ రెండు పాటల్ని కూడా ఈ నెలాఖర్లోపు పూర్తి చేసేస్తారట.
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ‘జై లవకుశ’ రెగ్యులర్ షూటింగ్ ఐదు నెల కిందటే మొదలైంది. మామూలుగా హీరో డ్యూయల్.. ట్రిపుల్ రోల్స్ చేస్తే షూటింగ్ ఆలస్యవమవుతూ ఉంటుంది. కానీ పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగిన డైరెక్టర్ బాబీ శరవేగంగా సినిమాను పూర్తి చేసేశాడు. ఈ సినిమా షూటింగ్ చేస్తూనే ‘బిగ్ బాస్’ షోలోనూ పాల్గొన్నాడు ఎన్టీఆర్. అయినా షెడ్యూళ్లు ఏమీ డిస్టర్బ్ కాలేదు. అనుకున్న ప్రకారం సినిమా పూర్తయిపోయింది. ‘బిగ్ బాస్’ షూట్ జరుగుతున్న పుణెలోనే షెడ్యూల్ వేసుకుని సినిమా చిత్రీకరణ కూడా సమాంతరంగా జరిపారు. ‘జై లవకుశ’లో జై పాత్రకు సంబంధించిన టీజర్ గత నెలే సందడి చేసింది. త్వరలోనే లవ పాత్రకు సంబంధించిన టీజర్ రాబోతోంది. ఎన్టీఆర్ సరసన ఈ చిత్రంలో రాశి ఖన్నా.. నివేదా థామస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.