జూనియర్ ఆ సెంటిమెంట్ వదిలేశాడా

Update: 2016-04-04 17:30 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఓ సెంటిమెంట్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేవాడు. నిజానికి అది సెంటిమెంట్ కంటే అలవాటు అని చెప్పాలి. ఏ డైరెక్టర్ అయినా మంచి హిట్ కొట్టగానే నెక్ట్స్ ఆఫర్ ఎన్టీఆర్ నుంచి ఉండేది. కొన్ని సార్లు ఈ స్ట్రాటజీ వర్కవుట్ అయినా.. చాలా సార్లు దెబ్బ కొట్టేసింది. ఇప్పుడా సెంటిమెంట్ కి ఎన్టీఆర్ దూరమవుతున్నట్లుగా కనిపిస్తోంది.

బోయపాటి శ్రీను - సంతోష్ శ్రీనివాస్ - సురేందర్ రెడ్డి - హరీష్ శంకర్.. ఇలా హిట్లు కొట్టిన డైరెక్టర్లతో వెంటనే సినిమాలను చేశాడు ఎన్టీఆర్. కానీ అవేవీ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు సరికదా.. ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి. అసలీ హిట్ డైరెక్టర్ సెంటిమెంట్ ను.. సుకుమార్ తో బ్రేక్ చేశాడు జూనియర్. 1-నేనొక్కడినే లాంటి డిజాస్టర్ తీసిన సుక్కుతో నాన్నకు ప్రేమతో చేశాడు. అది ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే, ఆ వెంటనే మళ్లీ శ్రీమంతుడుతో బ్లాక్ బస్టర్ కొట్టిన కొరటాల శివతో సినిమా స్టార్ట్ చేయడంతో.. మళ్లీ పాత సెంటిమెంట్ నే ఫాలో అయ్యాడనే టాక్ వినిపించింది.

కానీ ఇప్పుడు హను రాఘవపూడికి ఛాన్స్ ఇవ్వనున్నాడట ఎన్టీఆర్. అందాల రాక్షసి లాంటి ఫ్లాప్, కృష్ణగాడి వీర ప్రేమగాధ అంటూ బిలో ఏవరేజ్ సినిమా తీసిన హనుకు ఛాన్స్ అంటే.. ఎన్టీఆర్ తన పాత సెంటిమెంట్ ను పూర్తిగా పక్కన పెట్టేసినట్లే చెప్పుకోవాలి. ఈ దర్శకుడితో ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేయనున్నాడట యంగ్ టైగర్.


Tags:    

Similar News