తారక్ కొత్త కారు స్పెషల్స్ మామూలుగా లేవుగా?

Update: 2021-08-19 03:33 GMT
నాగచైతన్యకు బైకులంటే పిచ్చి.. కొత్త మోడల్ బైక్ వచ్చినంతనే కొనేందుకు తెగ ఉత్సాహాన్నిప్రదర్శిస్తుంటారు. ఇక.. యంగ్ టైగర్ తారక్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ కు కొత్త కార్లు అన్నా.. ఖరీదైన వాచీలన్నా మహా ఇష్టం. కొత్త ఎడిషన్ వాచీలు వస్తేచాలు.. ముందు ఆయనకు చూపించాలని చెబుతారు. ఖరీదైన విలాసవంతమైన కార్లను కొనుగోలు చేసేందుకు ఆయన ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఆయన కార్ల జాబితాలోకి కొత్త కారు వచ్చి చేరింది.

ఇప్పటికే ఆయన గ్యారేజ్ లో రూ.2.10 కోట్ల ఖరీదైన రేంజ్ రోవర్ ఉంది. ఇది కాక.. పోర్స్నే 718 కేమన్ ఉంది. దీని ఖరీదు జస్ట్ రూ.1.22కోట్లు మాత్రమే. దీటితో పాటు స్కోడా లగ్జరీ కారు ఉంది. తాజాగా ఆయన కార్ల శ్రేణిలో లాంబోర్గిని చేరింది. దీని ఖరీదు రూ.3.16 కోట్లుగా చెబుతున్నారు. తాజాగా బెంగళూరు నుంచి ఆయన ఇంటికి చేరింది.

సాధారణంగా ఏదైనా పాపులర్ కారు.. బైక్ లాంటివి కొత్తగా వచ్చినప్పుడు రాష్ట్రంలోనే తొలి కారు.. జిల్లాలో తొలి కారు.. ఊళ్లో తొలి కారు లాంటి రికార్డుల కోసం తెగ ప్రయత్నించేవారు. తాజాగా తారక్ కు అలాంటి ప్రయత్నం లేకుండానే.. దేశంలోనే తొలికారు ఆయనదే అన్న రికార్డు సొంతమైంది.

ఆసక్తికరమైన విషయంఏమంటే.. తాజా లంబోర్గిని యూరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ కారు దేశంలోనే మొదటిది తారక్ ఇంట్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఏడాది మొదట్లో ఈ కారు వివిధ రంగుల్లో విడుదలైంది. తారక్ బ్లాక్ కలర్ కారును సొంతం చేసుకున్నారు. ఇటీవల లంబోర్గిని కొనుగోలు చేస్తున్న సెలబ్రిటీలు ఎక్కువ అవుతున్నారు.

ఈ మధ్యనే ప్రభాస్.. బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ లుకొనుగోలు చేశారు. కోట్లు విలువ చేసే కార్లను కొనేయటం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. మరి.. సెలబ్రిటీలు ఉరుకుంటారా ఏంటి?
Tags:    

Similar News