నాన్న‌కు ప్రేమ‌తో.. భ‌యంక‌ర‌మైన రెస్పెక్ట్

Update: 2016-01-22 16:04 GMT
నాన్న‌కు ప్రేమ‌తో సినిమా ఎన్ని కోట్ల క‌లెక్ష‌న్లు తెచ్చి పెట్టింద‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. త‌న‌తో పాటు యూనిట్లో అంద‌రికీ భ‌యంక‌ర‌మైన రెస్పెక్ట్ మాత్రం తెచ్చిపెట్టింద‌ని అంటున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.కెరీర్ లో వెన‌క్కి తిరిగి చూసుకుంటే నాన్న‌కు ప్రేమ‌తో లాంటి ఓ మంచి సినిమా చేశాన‌న్న సంతృప్తి కూడా ఈ మూవీ వ‌ల్ల క‌లుగుతుంద‌ని ఎన్టీఆర్ చెప్పాడు. శుక్ర‌వారం నాన్న‌కు ప్రేమ‌తో స‌క్సెస్ మీట్లో భాగంగా ఎన్టీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు.ఎన్టీఆర్ ఇంకా ఏమ‌న్నాడంటే..

‘‘నాన్న‌కు ప్రేమ‌తో షూటింగ్ మ‌ధ్య‌లో అవ‌స‌రాల శ్రీనివాస్ ఓ మాట అన్నాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చెప్ప‌లేను కానీ మ‌న‌కి భ‌యంక‌ర‌మైన రెస్పెక్ట్ వ‌స్తుంద‌ని చెప్పాడు. ఇప్పుడు అలాగే జ‌రిగింది. ఈ సినిమా  వ‌సూళ్ల కంటే మాకు ఎంతో రెస్పెక్ట్ తీసుకు వ‌చ్చింది. మేం చేసిన ప్ర‌య‌త్నాన్ని అభినందించి ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కులంద‌రికీ థ్యాంక్స్, నా జీవితాంతం గుర్తుండిపోయే చిత్రాన్ని అందించిన సుకుమార్ గారికి కూడా థ్యాంక్స్‌.  కెరీర్లో వెన‌క్కి తిరిగి చూసుకుంటే ‘నాన్న‌కు ప్రేమ‌తో’ అనే మంచి సినిమా చేశానన్న సంతృప్తి ఉంది. ఈ సినిమాను వ్యాపార కోణంలో కాకుండా సినిమాపై వ్యామోహంతో తీసిన నిర్మాత  ప్ర‌సాద్ గారికి కూడా థ్యాంక్స్‌. మా ప్ర‌య‌త్నానికి దేవిశ్రీ ప్రాణం పోశాడు. ఈ సినిమా విష‌యంలో నేను చిన్న‌పిల్లాడిని. జ‌గ‌ప‌తి బాబు గారు, రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు, నిర్మాత ప్ర‌సాద్ గారు, సుకుమార్ గారు.. ఈ నలుగురు పిల్ల‌ర్స్ ర‌కుల్ కూడా అద్భుతంగా చేసింది’’ అని ఎన్టీఆర్ అన్నాడు.

Tags:    

Similar News