డే వన్‌ రికార్డులకు.. గాట్టి ఎసరే

Update: 2016-01-11 11:30 GMT
ఎప్పటినుండో 50 కోట్ల షేర్‌ ను వసూలు చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు ఎన్టీఆర్‌. సుకుమార్ డైరక్షన్‌ లో నాన్నకు ప్రేమతో అంటూ జనవరి 13న వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ధియేటర్ల షేరింగ్‌ కారణంగా ఈ సినిమా కలెక్షన్లకు భారీ ఎసర పడనుందా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్‌ నిపుణులు.

రావల్సిన కలెక్షన్‌ కంటే.. మొదటి రోజున 3 కోట్లు డెఫిసిట్‌ ఈ ధియేటర్‌ షేరింగ్‌ కారణంగానే వచ్చేస్తోంది. ఇప్పటికే ధియేటర్ల యాజమాన్యాలు 50:50 రెవెన్యూ షేరింగ్‌ పద్దతిలో సినిమాను డీల్‌ చేశారు కాబట్టి.. ఈసారి గ్రాస్‌ ఎమౌంటులో వారికి వెళ్లేదే ఎక్కవు. సో.. డిస్ట్రిబ్యూటర్‌ ను దాటి నిర్మాతకు వచ్చే ''షేర్‌''పై ఆ ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఈస్ట్‌ అండ్‌ వెస్ట్‌ లో సంక్రాంతి అంటే హాలీడే కాబట్టి.. అక్కడ కాస్త ఎక్కవు కలెక్షన్లు వచ్చే ఛాన్సుంది. మరి నైజాం పరిస్థితి ఏంటి? జనవరి 13న ఎన్టీఆర్‌ ఇక్కడ ఎటువంటి ప్రభావం చూపించనున్నాడు. శ్రీమంతుడు తొలి రోజున షుమారు 14 కోట్ల షేర్‌ వసూలు చేశాడు. బాహుబలి కాకుండా మనకు ఇదే రికార్డ్‌. మరి దానిని బీట్‌ చేయడం కుదురుతుందా అంటే.. టెక్నికల్‌ గా పాజిబిలిటీ లేదు. ధియేటర్ల కొరత కారణంగా మొదటి రోజే కాదు.. 2వ రోజు నుండి ఇతర సినిమాలు ధియేటర్లను ఎత్తేస్తున్నాయి కాబట్టి.. ఫస్ట్‌ వీకెండ్‌ 'షేర్‌' రికార్డులకు కూడా దెబ్బ పడినట్లే.

ఇక రికార్డుల సంగతి పక్కనెట్టేస్తే.. అసలు ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ మొత్తాన్ని రికవర్‌ చేయడమే జూనియర్‌ మెయిన్‌ టార్గెట్‌.

Tags:    

Similar News