చివ‌రికి ఎన్టీఆర్ ని అలా ఫేమ‌స్ చేశారు!

Update: 2021-10-07 01:30 GMT
ప్ర‌స్తుతం తార‌క్ `ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు?` రియాలిటీ షోతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు కొర‌టాల‌తో సినిమాపైనా దృష్టి సారించారు. ఇదిలా ఉండ‌గానే ఆయ‌న పేరు ఆ రెండు అంశాల‌తో కాకుండా మా ఎల‌క్ష‌న్స్ తో ముడిపడి వైర‌ల్ అవుతుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

అక్టోబ‌ర్ 10న జ‌ర‌గ‌నున్న `మా` అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో తాను ఓటు వేయ‌బోన‌ని అన‌డంతో అది కాస్తా హాట్ టాపిక్ గా మారింది. త‌న‌కు ఓటేయాల్సిందిగా కోరిన జీవిత‌తో ప్ర‌స్తుతం `మా` అసోసియేష‌న్ లో ప‌రిస్థితులు బాధాక‌రంగా ఉన్నాయ‌ని తాను ఓటు వేయ‌న‌ని తార‌క్ అన్నారట. ఆ విష‌యాన్ని ఆమె మీడియా ముందు చెప్ప‌డంతో ఇక వ‌రుస‌గా నెగెటివ్ క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి.

మంచు విష్ణు మ‌ద్ధ‌తుదారు నరేష్ పై ఆరోపిస్తూ ఎన్టీఆర్ ని రింగ్ లోకి లాగారు జీవిత‌. త‌న‌ని ఓటు అడ‌గొద్ద‌ని తార‌క్ అన్నార‌ని ఓటింగ్ కి రాన‌ని అన్నారంటూ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం మా అసోసియేష‌న్ వ్య‌వ‌హారాలు తార‌క్ కి న‌చ్చ‌డం లేద‌ని అన్నారు జీవిత‌. అయితే దీనిని ఈ ఎన్నిక‌ల్లో రాజ‌కీయం చేస్తూ ప్ర‌త్య‌ర్థుల ప్ర‌చారం హోరెత్తుతోంది. ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరో నలుగురికి ఆదర్శంగా నిలుస్తూ ఓటేయాల‌ని ఓటు వేయ‌న‌ని అన‌కూడ‌ద‌ని మీడియాల‌న్నీ క్లాస్ లు తీస్కుంటున్నాయి. తార‌క్ అలా ఓటు వేయను అని చెప్పడం కరెక్ట్ కాద‌ని.. ఎన్టీఆర్ కు ఫోన్ చేసి .. అలా మాట్లాడ్డం కరెక్ట్ కాదు బంగారం .. వచ్చి న‌చ్చిన వారికి ఓటు వేయమని కోరుతాను.. అంటూ ప్ర‌కాష్ రాజ్ వ్యాఖ్యానించారు.

మొత్తానికి జీవిత అన‌వ‌స‌రంగా తార‌క్ పేరును బ‌య‌ట‌పెట్టారు. దీంతో ఈ న్యూసెన్స్ అంతా ఆయ‌న‌కు చుట్టుకుంది. చ‌ర‌ణ్ .. మ‌హేష్ ... ప్ర‌భాస్ .. బ‌న్ని వీళ్లెవ‌రూ మా ఎన్నిక‌ల గురించి ప్ర‌స్థావించ‌లేదు. కానీ ఎన్టీఆర్ పేరు మాత్రం మార్మోగిపోతోంది. అది కూడా మీడియా టీఆర్పీ స్టంట్ అంటూ అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది.


Tags:    

Similar News