దళిత శిరోముండనం కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టినప్పటి నుంచి నూతన్‌నాయుడు నిర్వాకాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఈ కేసులో నూతన్ నాయుడు ప్రమేయం ఉన్నట్లుగా భావించిన పోలీసులు అతని పేరును ఎ8గా చేర్చారు. శిరోముండనం తర్వాత ఓ ఫోన్ నెంబరుతో రిటైర్ట్ ఐఎఎస్ పీవీ రమేష్ పేరును ఉపయోగించి డాక్టర్లను తప్పుదోవ పట్టించిన నూతన్ నాయుడు ఇలా ఇంకా ఏ తరహా మోసాలకు పాల్పడిందీ తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పోలిసుల విచారణలో నూతన్ నాయుడు భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తామని నూతన్ చేసిన మోసాలపై పోలీసులు విచారణ చేసి , వివరాలు సేకరించారు. ప్రభుత్వ రంగ బ్యాంక్ డైరెక్టర్ పదవి ఇప్పిస్తామని రియల్టర్ దగ్గర రూ.12 కోట్లు స్వాహా చేసినట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. దీనితో పాటు అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తామని ఓ వ్యక్తి వద్ద రూ.5 లక్షలు వసూలు చేసినట్టు వెల్లడైంది. ఇక పోలీసులు కస్టడీలోకి తీసుకునే ముందు.. నూతన్ నాయుడును అతని నివాసంలోనే పోలీసులు విచారించారు. ఈక్రమంలో అతను డ్రామాకు తెరతీశాడు. తనకు కడుపులో నొప్పిగా ఉందంటూ నాటకం ఆడినట్టు తెలుస్తుంది. అయితే, వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పిన విశాఖ పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు.