రౌడీ బేబీ టైటిల్ కి ఛాంబ‌ర్ లో అభ్యంత‌రం..?‌

Update: 2021-03-13 16:30 GMT
యూట్యూబ్ లో రౌడీ బేబీ సాంగ్ సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. కోటాను కోట్ల మంది వీక్షించిన క్యాచీ సాంగ్ ఇది. సాయి ప‌ల్ల‌వి - ధ‌నుష్ జంట అసాధార‌ణ డ్యాన్సింగ్ విన్యాసాలు.. కొరియోగ్ర‌ఫీ ప్ర‌తిభ‌.. మ్యూజిక్ ఇలా అన్ని కోణాల్లోనూ ఆ సాంగ్ ఓ సెన్సేష‌న్.

అలాంటి పాపుల‌ర్ లిరిక్ నే టైటిల్ గా ఎంపిక చేసుకోవ‌డం ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలివైన ప‌ని అన‌డంలో ఎలాంటి సందేహమే లేదు. యువ‌హీరో సందీప్ కిష‌న్ కోసం ఆ టైటిల్ ని ఛాంబ‌ర్ లో రిజిస్ట‌ర్ చేయించాల‌నుకుంటే ఊహించ‌ని చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయ‌ట‌. అప్ప‌టికే రౌడీ బోయ్ అనే టైటిల్ ని రిజిస్ట‌ర్ చేయించిన దిల్ రాజు- శిరీష్ బృందం ఇంచుమించు అదే సారూప్య‌త ఉన్న రౌడీ బేబి టైటిల్ సెలెక్ష‌న్ కి అడ్డంకి చెప్పార‌ట‌.

దీంతో ఆ టైటిల్ ఎంపిక నిర్ణ‌యాన్ని విర‌మించుకున్నార‌ని తెలిసింది.సందీప్ సినిమా టైటిల్ ని మేక‌ర్స్ గత ఏడాది డిసెంబర్ లో అధికారికంగా ప్రకటించారు. షూట్ త్వరలో ప్రారంభం కానుంద‌ని తెలిసింది. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా మేము మా టైటిల్ # రౌడీబేబీ నుండి మరింత ఆసక్తికరమైన టైటిల్ కి మారుస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం.. అని కోన ఫిలిం కార్ప్ ట్విట్ట‌ర్ లో అధికారికంగా ప్ర‌క‌టించింది.

వాస్త‌వానికి కోన ఫిలింకార్ప్ `రౌడీ బేబీ`ని టైటిల్ గా ప్రకటించినప్పటి నుండి నిర్మాత దిల్ రాజు ఫిల్మ్ ఛాంబర్ లో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాజు సోదరుడు శిరీష్ కొడుకు హీరోగా అరంగేట్రం చేస్తున్న మూవీకి `రౌడీ బాయ్` అనే టైటిల్ ని చాంబ‌ర్ లో రిజిస్ట‌ర్ చేయించ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News