మెగాడాటర్ నీహారిక సినీ అరంగేట్రం చేయడంపై బోలెడంత ఆసక్తి తర్వాత.. ఒక మనసు గతవారం రిలీజ్ అయింది. చాలా సంవత్సరాల తర్వాత పెద్ద ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి హీరోయిన్ గా రంగ ప్రవేశం చేయడంతో.. ఇండస్ట్రీ జనాలు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. ఆడియన్స్ లో ఉన్న ఆసక్తి కారణంగా మొదటి రోజున ఒక మనసు చిత్రానికి అంచనాలకు మించిన కలెక్షన్స్ వచ్చాయి. అయితే సినిమా నెరేషన్ మరీ పాత చింతకాయ పచ్చడి టైపులో ఉండడంతో.. రెండో రోజు నుంచి దారుణంగా డ్రాప్ అయిపోయాయి.
ఒక మనసు చిత్రాన్ని బతికించేందుకు నిర్మాతలు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇవ్వలేదు. దీనికి తోడు అరంగేట్రంలో అతి బరువైన పాత్ర చేయడంతో.. నీహారికకు కూడా పెద్దగా మార్కులు పడలేదు. నటన పరంగా పర్లేదనిపించడం ఒకటే ఈ సినిమాతో నీహారికకు దక్కిన పాజిటివ్ పాయింట్. ఇక ఈ చిత్రాన్ని ఇప్పటికే ఫ్లాప్ గా తేల్చేశాయి ట్రేడ్ వర్గాలు. దీనితో పాటే విడుదలైన కుందనపు బొమ్మ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దర్శకేంద్రుడి సమర్పణ.. కీరవాణి మ్యూజిక్ లాంటివి కూడా థియేటర్లకు జనాలను రప్పించలేకపోయాయి.
ఈ రెండింటితో పాటే రిలీజ్ కావాల్సి ఉన్నా.. ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చింది శర్వానంద్-నిత్యామీనన్ ల రాజాధిరాజా. ప్రమోషన్స్ లేకపోవడం.. అసలు సినిమా సంగతి చాలామందికి తెలియకపోవడం.. హీరో-హీరోయిన్స్ తో సహా ఎవరూ రిలీజ్ ని పట్టించుకోకపోవడంతో.. రాజాధిరాజా పరిస్థితి కూడా తీసికట్టుగానే ఉంది. దీంతో గత వారం రిలీజ్ అయిన సినిమాలన్నీ ఫ్లాప్స్ గా మిగిలాయి. ఇక ఈ వారం రిలీజ్ అయిన చిత్రాల పరిస్థితి తెలియాలంటే.. మరో రెండు రోజులు ఆగాల్సిందే.