చిత్రం : ‘ఒక్క అమ్మాయి తప్ప’
నటీనటులు: సందీప్ కిషన్ - నిత్యా మీనన్ - రవికిషన్ - రాహుల్ దేవ్ - ఆలీ - నళిని - రోహిణి - సప్తగిరి - తాగుబోతు రమేష్ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: ఛోటా కే నాయుడు
నిర్మాత: భోగాది అంజిరెడ్డి
రచన - దర్శకత్వం: రాజసింహా తాడినాడ
‘రుద్రమదేవి’ సినిమాతో మాటల రచయితగా మంచి పేరు సంపాదించిన రాజసింహా మెగా ఫోన్ పట్టాలన్న తన చిరకాల వాంఛను ‘ఒక్క అమ్మాయి తప్ప’తో నెరవేర్చుకున్నాడు. దర్శకుడిగా అతను.. హీరోగా సందీప్ కిషన్.. నిర్మాతగా అంజి రెడ్డి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి చేసినట్లుగా చెప్పుకున్న ఈ సినిమా.. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి బాగానే చర్చనీయాంశమవుతోంది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విశేషాలు చూద్దాం పదండి.
కథ:
కృష్ణవచన్ (సందీప్ కిషన్) చిన్నప్పుడు స్కూల్లో ఉండగానే తాను ముద్దుగా మ్యాంగో అని పిలుచుకునే అమ్మాయి (నిత్యా మీనన్)కి ఐలవ్యూ చెప్పేసిన అల్లరి పిల్లోడు. పెద్దయ్యాక హైదరాబాద్ లోని ఓ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ జాంలో అనుకోకుండా అదే అమ్మాయిని కలుస్తాడు. మందు ఇద్దరి మధ్య గొడవ జరిగినా.. కొంత సమయం గడిచాక ఇద్దరికీ ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అప్పుడే తాను చిన్నపుడు ఐలవ్యూ చెప్పిన అమ్మాయి తనేనని కృష్ణవచన్ కు తెలిసి ఆ అమ్మాయిపై ఇష్టం పెంచుకుంటాడు. ఐతే గంటలు గడిచినా ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాదు. నిజానికి అన్వర్ (రవికిషన్) అనే వ్యక్తి.. కావాలనే ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ చేయించి.. అక్కడ బ్లాస్ట్ ప్లాన్ చేశాడని తర్వాత తెలుస్తుంది. తాను అనుకున్న ఆపరేషన్ ఫెయిలవడంతో కృష్ణవచన్ ద్వారా బ్లాస్ట్ చేయించాలనుకుంటాడు అన్వర్. అందుకోసం అతనేం చేశాడు.. అతడి చేతిలో కృష్ణవచన్ ఎలా బందీ అయ్యాడు.. చివరికి కృష్ణవచన్ ఈ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
తాను రాసుకున్న కథ చాలా మందికి నచ్చినా.. ఇందులో ఉన్న రిస్క్ భరించడానికి వాళ్లెవ్వరూ ముందుకు రాలేదని.. చివరికి ఏడెనిమిదేళ్ల కిందట రాసుకున్న కథకు ఇప్పుడు మోక్షం లభించిందని చెప్పాడు ‘ఒక్క అమ్మాయి తప్ప’తో దర్శకుడడిగా మారిన రాజసింహా. నిజానికి తెలుగులో ఓ కొత్త దర్శకుడు ఇలాంటి కథతో తన తొలి సినిమా తీస్తానంటే నిర్మాతలు భయపడటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే ఈ కథ మొత్తం దాదాపుగా ఒక ఫ్లైఓవర్ మీదే సాగిపోతుంది. రెండుంబావు గంటల నిడివిలో 80 శాతం సన్నివేశాలు ఒకే లోకేషన్లో నడుస్తాయి.
ఎంతో అనుభవం.. నైపుణ్యం ఉంటే తప్ప ఇలాంటి కథల్ని డీల్ చేయడం కష్టం. ఇలాంటి కథను తన అరంగేట్రానికి ఎంచుకున్నందుకు రాజసింహాను అభినందించాలి. ప్లాట్ పరంగా ‘ఒక్క అమ్మాయి తప్ప’ ఆసక్తి రేకెత్తించేదే. ఇందులో థ్రిల్ చేసే అంశాలు.. ఉత్కంఠభరిత సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. కానీ ఇలాంటి కథలకు అవసరమైన ‘బిగి’ మాత్రం ఇందులో కనిపించలేదు. టైట్ స్క్రీన్ ప్లే లేకపోవడం.. అర్థం లేని కామెడీ సీన్స్ కథ నుంచి డీవియేట్ చేయడం వల్ల.. హీరో-విలన్ మధ్యసాగే మైండ్ గేమ్ అంత ఇంటలిజెంట్ గా లేకపోవడం వల్ల ‘ఒక్క అమ్మాయి తప్ఫ’ ఓ సగటు చిత్రంగా నిలిచిపోయింది.
హిందీలో కొన్నేళ్ల కిందట వచ్చిన ‘ఎ వెడ్నస్ డే’ స్ఫూర్తితో రాజసింహా ఈ కథను రాసుకున్నట్లుగా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ హీరో ప్లేస్ లోకి విలన్ వచ్చాడు. ఫ్లైఓవర్ మీద పొద్దుట్నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ నిలిచిపోవడం.. ఎవరూ ఎటూ కదలకుండా అక్కడే ఉండిపోవడం.. ఫ్లైఓవర్ మీద ఉన్న వ్యక్తితో విలన్ దూరం నుంచి తన మిషన్ అమలు చేయించడం.. ఇవన్నీ లాజిక్ కు అందని విషయాలే కానీ.. ఇదంతా కొంచెం కొత్తగా.. ఆసక్తికరంగానే అనిపిస్తుంది. ప్రథమార్ధమంతా పాత్రల పరిచయం.. సోసోగా సాగిపోయే సరదా సన్నివేశాలతో నడిపించేసిన దర్శకుడు.. ఇంటర్వెల్ దగ్గర్నుంచే అసలు కథలోకి వెళ్లాడు.
విలన్ హీరో ద్వారా ఆపరేట్ చేయడం మొదలుపెట్టాక కథనంలో ఉత్కంఠ మొదలవుతుంది. ద్వితీయార్దంలో తర్వాత ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠను బాగానే మెయింటైన్ చేశాడు దర్శకుడు. ఐతే మధ్య మధ్యలో మీడియా అప్ డేట్స్ ఇచ్చే తీరు బాగా విసిగిస్తుంది. కామెడీ సీన్స్ కూడా సిల్లీగా తయారయ్యాయి. ఈ సన్నివేశాల్లో దర్శకుడి అపరిపక్వత బయటపడుతుంది. మత సామరస్యం గురించి తనికెళ్ల భరణి లెక్చర్ దంచే సీన్ కూడా మరీ డ్రమటిగ్గా అనిపిస్తాయి. థ్రిల్లర్ సినిమాను థ్రిల్లర్లాగా నడిపించకుండా.. టైంపాస్ కోసం కామెడీ చేయించడాలు.. సందేశాలివ్వడాల వల్ల కథనం పక్కదారి పట్టేస్తుంది.
చివరి 20 నిమిషాల్లో మాత్రం దర్శకుడు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయగలిగాడు. ఇక్కడ కూడా విలన్ క్యారెక్టర్ కు సంబంధించి ఇచ్చే ట్విస్టు అంత కన్విన్సింగ్ గా లేకపోయినా.. సినిమాను ముగించిన తీరు బాగుంది. మెయిన్ ప్లాట్ చుట్టూ ఉత్కంఠభరితంగా కథనాన్ని నడిపేంత సామర్థ్యం దర్శకుడికి లేకపోడం వల్ల ‘ఒక్క అమ్మాయి తప్ప’ మంచి థ్రిల్లర్ గా రూపుదిద్దుకోలేకపోయింది. కాన్సెప్ట్ పరంగా భిన్నంగా ఆలోచించిన రాజసింహా.. కథనాన్ని కూడా అంతే భిన్నంగా నడిపించాల్సింది. ఆలీతో పెళ్లిచూపుల సీన్స్ కానీ.. టీవీ ఛానెళ్ల తీరు మీద.. మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి వైద్యం మీద సెటైర్లు వేసే సన్నివేశాలు కానీ.. ఎంతమాత్రం కథనానికి అవసరం లేనివి. ఇలాంటి సన్నివేశాల వల్ల థ్రిల్లర్ చూస్తున్న ఫీల్ పోయింది. కథ పక్కదారి పట్టింది. ఓవరాల్ గా ‘ఒక్క అమ్మాయి తప్ప’ పర్వాలేదు అనన్న ఫీలింగ్ మిగులుస్తుంది.
నటీనటులు:
సందీప్ కిషన్ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద నడిపించాడు. థియేటర్ నుంచి బయటికి వచ్చాక కూడా అతడి పెర్ఫామెన్స్ గుర్తుంటుంది. ఎప్పట్లాగే కాన్ఫిడెంటుగా నటించాడు. కానీ కొన్ని చోట్ల కాన్ఫిడెన్స్ మరీ ఎక్కువైపోయి ఇబ్బంది పెట్టేశాడు. పతాక సన్నివేశాల్లో సందీప్ నటన బాగుంది. నిత్యామీనన్ నుంచి ఆమె అభిమానులు ఎక్కువ ఆశిస్తే కష్టమే. సినిమాలో ఆమె పాత్రకు మరీ ప్రాధాన్యమేమీ లేదు. ఆమె తన టాలెంట్ చూపించడానికి తగ్గ సన్నివేశాలు పడలేదు. ఆమెకు తగ్గ ప్రత్యేకమైన పాత్రేమీ కాదిది. ఐతే తనకు స్కోప్ ఉన్నంత వరకు బాగానే చేసింది.
విలన్ పాత్రలో రవికిషన్ చాలాచోట్ల అతిగా నటించాడు. విలన్ గా అతను భయపెట్టలేదు కానీ.. కొన్ని చోట్ల నవ్వించాడు. ఈ పాత్రను దర్శకుడు అలా డిజైన్ చేశాడు మరి. కమెడియన్లు చాలామంది నవ్వించడానికి ప్రయత్నించారు కానీ.. అందరూ ఫెయిలయ్యారు. ఉన్నంతలో పృథ్వీ కాస్త మెరుగు. మిగతా వాళ్లంతా మామూలే.
సాంకేతికవర్గం:
సినిమాలో పర్ఫెక్ట్ అని చెప్పుకోవాల్సింది ఛోటా కే నాయుడు ఛాయాగ్రహణం గురించే. చాలావరకు సినిమా ఫ్లై ఓవర్ మీద ఒకే లోకేషన్లో సినిమా సాగినా.. మొనాటనీ రాకుండా తన కెమెరాతో మ్యాజిక్ చేశాడు చోటా. ఛాయాగ్రహణం రిచ్ గా.. టాప్ క్లాస్ గా అనిపిస్తుంది. సినిమాకు ఇదే మేజర్ హైలైట్. మిక్కీ జే మేయర్ సంగీతం పర్వాలేదు. పాటలేమీ రిజిస్టర్ కావు. ఇలాంటి సినిమాలకు పాటలు సూటవ్వవు కూడా. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తక్కువ బడ్జెట్లోనే క్వాలిటీ చూపించారు. రచయిత-దర్శకుడు రాజసింహాకు యావరేజ్ మార్కులు పడతాయి. కథ విషయంలో అతడికి వచ్చిన ఐడియా బాగుంది. కొన్ని సన్నివేశాల్లో దర్శకుడిగా పనితనం చూపించాడు. కానీ నిలకడ లేకపోయింది. బిగువైన స్క్రీన్ ప్లే రాసుకోలేదు. కొన్ని సన్నివేశాల్ని ఇమెచ్యూరిష్ గా డీల్ చేశాడు. కథాకథనాల మీద అతను మరింతగా కసరత్తు చేయాల్సింది. అతను రాసిన డైలాగుల్లో కొన్ని బాగున్నాయి. ‘‘అర్థం చేసుకున్నపుడు కాదు.. అపార్థాలు తొలగిపోయినప్పుడే నిజమైన ప్రేమ తెలుస్తుంది’’.. అందులో ఒకటి.
చివరగా: ఒక్క అమ్మాయి తప్ప.. ఒక్కసారి చూడొచ్చు.
రేటింగ్- 2.5/5
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre