కరోనా ఇక లేదు, మరి రాదు అని నిబ్బరంగా ఉన్నంతసేపు పట్టలేదు. మూడవ విడత ఒమిక్రాన్ పేరిట వాకిట నిలిచి పలుకరిస్తోంది. రోజుకు లక్షన్నరకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈసారి సంక్రాంతి పండుగకు పాన్ ఇండియా లెవెల్ మూవీతో పాటు ఎన్నో పెద్ద సినిమాకు రెడీ ఫర్ రిలీజ్ అన్నాయి.
నిజంగా ఈ సంక్రాంతి టాలీవుడ్ కి కొత్త కళను తెస్తుందని అంతా ఆశించారు. దీనికి ముందు డిసెంబర్ నెలలో మూడు బ్లాక్ బస్టర్లు పడ్డాయి. అఖండతో మొదలుపెడితే పుష్ప, శ్యామ్ సింగరాయ్ మూవీస్ తో టాలీవుడ్ కి కొత్త కళ కట్టింది. అదే ఊపు కంటిన్యూ అవుతుంది అనుకున్నారు అంతా.
బాహుబలి టూ తో ఏకంగా వేయి కోట్లను కలెక్షన్స్ రాబట్టిన దర్శక ధీరుడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ తో తన రికార్డు తానే బద్ధలు కొడతారు అని అంతా భావించారు. ఇక ట్రిపుల్ ఆర్ బిజినెస్ ఆరు వందల కోట్ల దాకా సాగింది. ఆల్ ఓవర్ ఇండియాతో పాటు ఓవర్ సీస్ లో కూడా ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయితే కుమ్మేసేదే. కానీ బ్యాడ్ లక్ ఒమిక్రాన్ రూపంలో వచ్చి ట్రిపుల్ ఆర్ వాయిదా పడిపోయింది.
ఇక రాధేశ్యామ్ మూవీ విషయం కూడా అదే. బాహుబలి రికార్డ్స్ ని దాటాలని ప్రభాస్ కూడా చూస్తున్నాడు. ఈ మూవీ కూడా నాలుగు వందల పైగా బిజినెస్ చేసింది. ఈ రెండు సినిమాలే కలిపి వేయి కోట్లకు పైగా బిజినెస్ ని ముందు పెట్టుకుని సంక్రాంతికి టచ్ చేశాయి. అదే విధంగా భీమ్లా నాయక్ వాయిదా పడినా మిగిలిన చిన్న సినిమాలు, మీడియం రేంజి సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి అయిది వందల కోట్ల బిజినెస్ చేసేవే.
ఇపుడు ఇవి కూడా డైలామాలో పడ్డాయి. రిలీజ్ చేసినా కలెకక్షన్లు డౌటే. డేరింగ్ చేసి బొమ్మ వదిలినా బిజినెస్ సవ్యంగా సాగుతుంది అన్నది నమ్మకం అయితే ఎవరికీ లేదు. దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉందిట. మొత్తం మీద చూసుకుంటే ఒక్క ఒమిక్రాన్ దెబ్బకు ఏకంగా పదినేను వందల కోట్ల రూపాయల సినిమా మార్కెట్ బిజినెస్ ని ఉఫ్ అని ఊదేసినట్లు అయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి టాలీవుడ్ కి సంక్రాంతి తీసుకురావాల్సిన పెద్ద సినిమాలన్నీ వాయిదాలతో మూలకు చేరడం మాత్రం సగటు సినీ ప్రేమికుడికి కూడా బాధాకరంగానే ఉంది మరి.