ఓంకార్.. తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. గత 15 ఏళ్లుగా తెలుగు బుల్లి తెరపై తనదైన ముద్రను వేసి ఎన్నో విప్లవాత్మక మార్పులను రియాల్టీ షోల్లో తీసుకు వచ్చిన ఘనత ఓంకార్ కు దక్కింది అనడంలో సందేహం లేదు. ఈయన షో ఏదైనా కూడా డ్రామాను పండించడంలో దిట్ట. స్టేజ్ షో ల్లో ఏడుపులు మొదలు పెట్టించింది ఈయనే అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వన్ సెకన్ అంటూ టెన్షన్ క్రియేట్ చేయడంలో ఈయన తర్వాతే మరెవ్వరైనా.. అంతా కూడా ఓంకార్ అన్నయ్య అంటూ పిలుచుకునే యాంకర్ ఓంకార్ కు అతి పెద్ద రియాల్టీ షో అయిన బిగ్ బాస్ బాధ్యతలు దక్కినట్లుగా సమాచారం అందుతోంది. అతి త్వరలో ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ అవ్వబోతున్న బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ బాధ్యతలను షో నిర్వాహకులు యాంకర్ ఓంకార్ కు అప్పగించారనే వార్తలు బుల్లి తెర వర్గాల్లో పెద్ద ఎత్తున వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఓంకార్ చేతికి షో నిర్వహణ బాధ్యతలు ఇచ్చారని.. కాని యాంకర్ మాత్రం నాగార్జునే కంటిన్యూ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో నాగార్జునను డైరెక్ట్ చేసిన ఓంకార్ ఇప్పుడు మరోసారి నాగార్జునను బిగ్ బాస్ కోసం డైరెక్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సాదారణ షో అయినా.. ఎలాంటి షో అయినా కూడా ఓంకార్ ఉన్నాడు అంటే ఖచ్చితంగా అది డ్రమటిక్ గా మారడం ఖాయం. బిగ్ బాస్ వంటి రియాల్టీ షో కు ఓంకార్ డైరెక్టర్ అయితే ఖచ్చితంగా ఏడుపులు.. రొమాన్స్.. డ్రామా.. గొడవలు జరగడం పక్కా. ఇప్పటికే బిగ్ బాస్ స్క్రిప్ట్ అంటూ ఉంటారు. ఇన్నాళ్లు స్క్రిప్ట్ ప్రకారం జరిగిందో లేదో కాని ఓంకార్ ఎంట్రీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ ఓటీటీ స్క్రిప్ట్ ప్రకారం నడువబోతుందని అంటున్నారు.
తెలుగు బిగ్ బాస్ కు ఉన్న ఆధరణ నేపథ్యంలో ఓటీటీకి సిద్దం అయ్యారు. ఓటీటీ వర్షన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించడం ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. ఫిబ్రవరి నుండి ఓటీటీ బిగ్ బాస్ ప్రారంభం కాబోతుంది. మళ్లీ రెగ్యులర్ మా టీవీ బిగ్ బాస్ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తానికి బిగ్ బాస్ రెండు సీజన్ లను వచ్చే ఏడాది చూడబోతున్నాం. ఓటీటీ లో బిగ్ బాస్ అంటే కాస్త ఆధరణ తక్కువ ఉంటుంది అనే అనుమానాలు ఉన్నాయి. అందుకే షో నిర్వాహకులు నిర్వహణ బాధ్యత ను మన ఓంకార్ అన్నయ్యకు ఇవ్వడం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆయన ఈ షో ను ఏ స్థాయిలో కుమ్మేస్తాడో చూడాలి.