హీరో సిద్ధార్థ్ చాలా గ్యాప్ తరవాత తిరిగి టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. అతడు ప్రస్తుతం ఆర్.ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో `మహా సముద్రం` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసినదే. చాలా కాలం తర్వాత టాలీవుడ్ లోకి రీఎంట్రీ మూవీ ఇది.
ఈ సినిమా రిలీజ్ కి ముందే మరో అనువాద చిత్రంతో సిద్ధార్థ్ పలకరించబోతున్నారు. అతడు నటించిన తమిళ చిత్రం `శివప్పు మంజల్ పచాయ్` తెలుగులో `ఒరేయ్ బామ్మర్ధి` గా వస్తోంది. ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ కుమార్ మరో ప్రధాన పాత్ర పోషించారు. బిచ్చగాడు ఫేమ్ శశి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఒరేయ్ బామ్మర్థి టీజర్ రిలీజైంది. ఇందులో సిద్ధార్థ్ వర్సెస్ జీవీ ప్రకాష్ ఎపిసోడ్స్ ఆద్యంతం రక్తి కట్టించాయి. సిద్ధార్థ్ ఒక సిన్సియర్ ట్రాఫిక్ పోలీసు అయితే.. జీవీ ప్రకాష్ అతడికి ఛాలెంజ్ విసిరే రెక్లెస్ స్ట్రీట్ రేసర్. అతడు ట్రాఫిక్ నియమాలను అస్సలు పట్టించుకోడు. రద్దీ సిటీలో ఫ్రెండ్స్ తో రేసింగుల్లో బెట్టింగులకు పాల్పడుతుంటాడు. నగరంలో ఇరుకు రోడ్డు ట్రాఫిక్ లో బైక్ రైడ్స్ చేస్తూ సాహసాలు చేస్తుంటాడు. అతడిని పట్టుకునేందుకు తపించే ట్రాఫిక్ ఆఫీసర్ గా సిద్ధార్థ్ కనిపిస్తున్నారు. ఆ ఇద్దరి మధ్యా రేసీ సీన్స్ ఆద్యంతం రక్తి కట్టిస్తున్నాయి. అయితే ఇందులో బామ్మర్థి ఎవరు? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.
ఇక టీజర్ ఆద్యంతం గ్రిప్పింగ్ నేరేషన్ స్టైల్ ఆకట్టుకుంది. అత్యున్నత సాంకేతిక విలువలతో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రక్తి కట్టించింది. ఇంతకుముందు సుశీంద్రన్ తెరకెక్కించిన `నా పేరు శివ` (కార్తీ హీరో) తరహాలో రేసీ మూవీ ఇదని టీజర్ చెబుతోంది. ఇకపోతే బిచ్చగాడు లాంటి క్లాసిక్ ని తెరకెక్కించిన శశి ఈసారి కూడా తనదైన మార్క్ చూపిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.Full View
ఈ సినిమా రిలీజ్ కి ముందే మరో అనువాద చిత్రంతో సిద్ధార్థ్ పలకరించబోతున్నారు. అతడు నటించిన తమిళ చిత్రం `శివప్పు మంజల్ పచాయ్` తెలుగులో `ఒరేయ్ బామ్మర్ధి` గా వస్తోంది. ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ కుమార్ మరో ప్రధాన పాత్ర పోషించారు. బిచ్చగాడు ఫేమ్ శశి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఒరేయ్ బామ్మర్థి టీజర్ రిలీజైంది. ఇందులో సిద్ధార్థ్ వర్సెస్ జీవీ ప్రకాష్ ఎపిసోడ్స్ ఆద్యంతం రక్తి కట్టించాయి. సిద్ధార్థ్ ఒక సిన్సియర్ ట్రాఫిక్ పోలీసు అయితే.. జీవీ ప్రకాష్ అతడికి ఛాలెంజ్ విసిరే రెక్లెస్ స్ట్రీట్ రేసర్. అతడు ట్రాఫిక్ నియమాలను అస్సలు పట్టించుకోడు. రద్దీ సిటీలో ఫ్రెండ్స్ తో రేసింగుల్లో బెట్టింగులకు పాల్పడుతుంటాడు. నగరంలో ఇరుకు రోడ్డు ట్రాఫిక్ లో బైక్ రైడ్స్ చేస్తూ సాహసాలు చేస్తుంటాడు. అతడిని పట్టుకునేందుకు తపించే ట్రాఫిక్ ఆఫీసర్ గా సిద్ధార్థ్ కనిపిస్తున్నారు. ఆ ఇద్దరి మధ్యా రేసీ సీన్స్ ఆద్యంతం రక్తి కట్టిస్తున్నాయి. అయితే ఇందులో బామ్మర్థి ఎవరు? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.
ఇక టీజర్ ఆద్యంతం గ్రిప్పింగ్ నేరేషన్ స్టైల్ ఆకట్టుకుంది. అత్యున్నత సాంకేతిక విలువలతో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రక్తి కట్టించింది. ఇంతకుముందు సుశీంద్రన్ తెరకెక్కించిన `నా పేరు శివ` (కార్తీ హీరో) తరహాలో రేసీ మూవీ ఇదని టీజర్ చెబుతోంది. ఇకపోతే బిచ్చగాడు లాంటి క్లాసిక్ ని తెరకెక్కించిన శశి ఈసారి కూడా తనదైన మార్క్ చూపిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.