'మేజర్' కోసం ఓటీటీ సంస్థలు పోటీపడ్డాయ్: మహేశ్ బాబు

Update: 2022-05-10 12:30 GMT
మహేశ్ తన సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. తాను హీరోగా చేస్తున్న ప్రాజెక్టులలో భాగస్వామిగా మారడమే కాకుండా, ఇతర హీరోలతో సినిమాలను నిర్మించడం కూడా జరుగుతుందని మహేశ్ బాబు ముందుగానే చెప్పాడు. అన్నట్టుగానే ఆయన నిర్మాణంలో అడివి శేష్ హీరోగా 'మేజర్' సినిమా రూపొందింది. శశి కిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఇది.

ఈ సినిమా లో అడివి శేష్ సరసన నాయికలుగా సయీ మంజ్రేకర్ .. శోభిత ధూళిపాళ్ల నటించారు. కీలకమైన పాత్రల్లో రేవతి .. ప్రకాశ్ రాజ్ .. మురళీ శర్మ కనిపించనున్నారు. జూన్ 3వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను లాంచ్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ .. 'మేజర్' ప్రాజెక్టు వ్యవహారాలన్నీ నమ్రత దగ్గరుండి చూసుకోవడం జరిగింది. సందేశం ఇవ్వడం కోసం అనే క్రెడిట్ నాకు ఇవ్వొద్దు. ఈ ప్రాజెక్టు నేను సపోర్ట్ చేశానంటేనే కరెక్టుగా ఉంటుంది.

ఈ సినిమా కూడా కోవిడ్ కి సంబంధించిన అన్ని రకాల అవరోధాలను ఎదుర్కొంది. షూటింగు పరంగా అనేక ఇబ్బందులను దాటుకుంటూ వెళ్లడం జరిగింది. నేను హీరోనే అయినా ఈ సినిమాను ఒక ప్రేక్షకుడిగానే చూస్తాను .

అప్పుడే  నేను ఆ సినిమాను ఎంజాయ్ చేయగలుగుతాను. లాక్ డౌన్ సమయంలోనే ఈ సినిమాకి  ఓటీటీ సంస్థల నుంచి భారీ ఆఫర్లు వచ్చాయి. కాకపోతే ఇది థియేటర్లో చూడదగిన సినిమా ..  థియేటర్ రెస్పాన్స్ ను చూడవలసిన సినిమా. అందువల్లనే దీనిని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాము.

ఈ సినిమాతో తెలుగు తెరకి హీరోయిన్ గా సైయీ మంజ్రేకర్ పరిచయమవుతోంది. తన కెరియర్ కి ఈ సినిమా చాలా  హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. ఇక నా సినిమా 'సర్కారువారి పాట' ఈ నెల 12వ తేదీన విడుదలవుతుంది.  ప్రస్తుతానికైతే బాలీవుడ్లో చేసే ఆలోచన లేదు. తెలుగులో చేసిన సినిమాలు బాలీవుడ్లో రిలీజ్ అయ్యేలా చూసుకుంటాను" అంటూ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News