ఏడాదిన్నర కాలంగా ఓటీటీలు ప్రేక్షకుల వినోదాల సాధనాలుగా మారిన సంగతి తెలిసిందే. వెబ్ సిరీస్ ల నుంచి సినిమాల వరకూ అన్ని భాషల కంటెంట్ ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్నాయి. అయితే పేరుకు ఓటీటీలు చాలానే ఉన్నా కొన్ని ఓటీటీలు మాత్రమే అన్ని చోట్లా ఆడియెన్ ని ఆకర్షిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ .. నెట్ ఫ్లిక్స్ తరహాలోనే హాట్ స్టార్ డిస్నీ లో రిలీజ్ అయ్యే కాంటెట్ ఇటీవల ఆకర్షిస్తోంది.
అందులో వెబ్ సినిమాలతో పాటు అగ్ర హీరోలు నటిస్తోన్న సిరీస్ ల్ని రిలీజ్ చేస్తూ ఓ బ్రాండ్ గా డిస్నీ హాట్ స్టార్ వెలిగిపోతుంది. ప్రేక్షకులకు రాజీలేని క్వాలిటీతో కంటెంట్ ని అందించడంలో హాట్ స్టార్ డిస్నీ ముందు వరుసలో నిలుస్తోంది. తాజాగా మరోసారి సాలిడ్ కటౌట్ ఉన్న హీరోలతో వెబ్ సిరీస్ లను అందించేందుకు రెడీ అవుతోంది.
అజయ్ దేవగణ్ - ఇషా డియోల్ నటించిన `రుద్రా: ద ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్` వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకు ముందు ఇదే సిరీస్ లో సుస్మితా సేన్ నటించింది. దాన్ని `ఆర్య` టైటిల్ తో తెరకెక్కించారు. ఇప్పుడు టైటిల్ ఛేంజ్ చేయడమే గాక థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ముందు కొస్తున్నారు. అలాగే ప్రతీక్ గాంధీ `షో సిక్స్ సస్పెక్ట్స్` తో కంబ్యాక్ అవుతున్నాడు. ఇది గ్రిప్పింగ్ స్కీన్ ప్లే తో సాగే మంచి సిరీస్ . ఇక `ఎస్కేప్ లైవ్ లో` సిద్ధార్థ్ - జావేద్ జాఫ్రీ- రిత్విక్ సహోర్ నటిస్తున్నారు. ఈ సిరీస్ లో కాన్సెప్ట్ హైలైట్ గా నిలుస్తోందని టాక్ ఇప్పటికే ఉంది. ఈ సిరీస్ రిలీజ్ కోసం ఓ వర్గం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
క్రైమ్ కాన్సెప్ట్ ల విషయానికి వస్తే.. పంకజ్ త్రిపాఠితో `క్రిమినల్ జస్టిస్` సీజన్- 3 .. కే.కే మీనన్ నటిస్తోన్న `స్పెషల్ ఓపిఎస్ 1.5` రిలీజ్ బరిలో ఉన్నాయి. ఇవి కూడా అతి త్వరలోనే డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక తెలుగు నటులతో తెరకెక్కుతున్న `ఘర్షణ` పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇందులో నవీన్ చంద్ర- శరత్ కుమార్- జగపతి బాబు ఉన్నారు. అలాగే తమిళ్ నుంచి ` మై పర్ఫెక్ట్ హజ్ బెండ్` రిలీజ్ అవుతుంది. ఇందులో తమిళ నటుడు సత్యరాజ్ నటించారు. అలాగే `ఫ్యామిలీ మాటర్స్` లో మురళి శర్మ- నందు- అక్షర గౌడ- సోనియా అగర్వాల్ నటిస్తున్నారు. ఇవన్నీ కూడా డిస్నీ హాట్ స్టార్ లో లోనే ప్రసారం కానున్నాయి.
ఆ రెండిటా వివాదాలు షురూ..
అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్ ఇటీవల వరుసగా వివాదాస్పద వెబ్ సిరీస్ లతో సంచలనాలకు తావిచ్చాయి. కంటెంట్ పరంగా ప్రయోగాల వల్ల బోలెడన్ని వివాదాలు చెలరేగడంతో వాటిని కోర్టుల పరిధిలో పరిష్కరించుకోవాల్సి వచ్చింది. ఇక అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన ఫ్యామిలీ మ్యాన్ 2 కంటెంట్ పరంగా వివాదాస్పదమైంది. తమిళనాడులో దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసినదే. నెట్ ఫ్లిక్స్ లోనూ పలు బోల్డ్ వెబ్ సిరీస్ లు వివాదాస్పదం అయ్యాయి. సత్యం రామలింగరాజు జీవితకథతో తెరకెక్కించిన ఓ సిరీస్ కూడా ఇలానే వివాదాస్పదమైంది. అది కోర్టుల పరిధిలోకి వెళ్లింది. స్టాంపుల కుంభకోణం కర్త అబ్ధుల్ కరీం తేల్గీ జీవితకథతో రూపొందిన స్కాం 2003 సిరీస్ వివాదాస్పదమైన సంగతి తెలిసినదే.