ఇమేజ్ సంపాదించుకోవటానికి ఒకప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చేది. ఒక భారీ విజయం అవసరమయ్యేది. కానీ.. ఇప్పుడు అందుకు భిన్నం. కాస్త యాక్టివ్ నెస్.. మరికాస్త తెలివి.. ఏ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలిసి ఉండటం చాలా అవసరం. అలాంటి చురుకైన వాళ్లు.. సక్సెస్ తో సంబంధం లేకుండా మీడియాలో వెలిగిపోతున్న పరిస్థితి.
ఆ కోవకే వస్తారు తమిళ బిగ్ బాస్ గేమ్ షోలో హాట్ టాపిక్ గా మారారు నటి ఓవియ. ఈ రియాల్టీ షోకు ముందు ఓవియాకు ఉన్న ఇమేజ్ వేరు.. షో తర్వాత ఆమెకు పెరిగిన ఇమేజ్ వేరని చెప్పక తప్పదు. ప్రస్తుతం లారెన్స్ మూవీలో యాక్ట్ చేస్తున్న ఆమెకు ఇప్పుడు సినిమా అవకాశాలు పెరిగాయి.
అయితే.. తనకు వెల్లువలా వచ్చి పడుతున్న అవకాశాన్ని ఓకే చేసేయటం అంత తేలికైన విషయం కాదని చెప్పారు. ఒకే సమయంలో పలు చిత్రాలకు ఓకే చెప్పటం కుదరదని చెబుతున్నారు. ఒక టీవీ షోకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ సందర్భంగా బిగ్ బాస్ తో తనకు పెరిగిన ఇమేజ్ తో పాటు పలు ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు.
సంపాదన కోసమే తాను మోడలింగ్ రంగానికి వెళ్లినట్లు చెప్పిన ఓవియా.. ఆ తర్వాత కళవాణి చిత్రంలో యాక్ట్ చేసే అవకాశం రావటంతో ఇండస్ట్రీకి పరిచయమైనట్లు చెప్పారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఆమెకు.. భారీ ఇమేజ్ ను చేజిక్కించుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఓవియా వ్యక్తిగత విషయాలకు వస్తే. నటుడు ఆరమ్ తో ఆమెకు రిలేషన్ ఉందన్న మాట బలంగా వినిపిస్తుంటుంది.
ఇదే విషయాన్ని ఓపెన్ గా అడిగిన ఆమెకు ఆసక్తికర సమాధానాన్ని చెప్పారు. తనకు ఒక పార్టనర్ ఉన్నారని.. ఆయనకు తాను.. తనకు ఆయన అంటూ విషయాన్ని ఒప్పేసుకున్నారు. ఇంతకీ ఆ పార్టనర్ ఎవరు? అన్న ప్రశ్నకు మాత్రం ఆమె బదులివ్వలేదు. విషయాన్ని చెప్పి చెప్పనట్లుగా చెప్పేసి మరింత ఆసక్తిని పెంచిన ఓవియా తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.