కృతికి ఆరంభ‌మే పాన్ ఇండియా ఆఫ‌ర్

Update: 2022-07-12 05:30 GMT
కెరీర్ ప్రారంభించిన త‌క్కువ స‌మ‌యంలోనే అసాధార‌ణ స్టార్ డ‌మ్ ని అందుకున్న తార‌లు కొంద‌రున్నారు. ఇటీవ‌లి కాలంలో క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న ఈ కేట‌గిరీకి చెందుతుంది.

ఆ త‌ర్వాత మ‌రో పేరు తెలుగు సినీస‌ర్కిల్స్ లో ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి మోస్ట్ ల‌క్కీయెస్ట్ గాళ్! అంటూ ప్ర‌శంసలు అందుకుంటోంది.

ఈ బ్యూటీ ఉప్పెన త‌ర్వాత వ‌రుస‌గా ప‌లు క్రేజీ చిత్రాల‌కు సంత‌కాలు చేసింది. ఇందులో వారియ‌ర్ లాంటి పాన్ ఇండియా సినిమా త‌న‌కే ద‌క్క‌డం ల‌క్కీ అని చెప్పాలి. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ లో కృతి లుక్ ఎంతో క్యూట్ గా ఆక‌ట్టుకుంది. నిజానికి కొంద‌రికి టైమ్ అలా క‌లిసొచ్చేస్తుంది.

కెరీర్ ఆరంభ‌మే లింగుస్వామి లాంటి ప్ర‌తిభావంతుడి నిర్ధేశ‌నంలో కృతి పాన్ ఇండియా నాయిక‌గా ప‌రిచ‌య‌మైపోతోంది.

ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని స‌ర‌స‌న కృతి శెట్టి కనిపించనుంది. లింగుసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం విడుదల కానుంది. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్త‌య్యాయి. యుఏ సర్టిఫికేట్ ను పొందినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా 155 నిమిషాల నిడివితో ఉంటుంద‌ని.. ఇది మంచి రన్ టైమ్ అని కూడా చిత్ర‌బృందం ధృవీకరించారు.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ ద్విభాషా చిత్రంలో ఆది పినిశెట్టి- అక్షర గౌడ- నదియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సౌండ్ ట్రాక్ లు అందించారు.
Tags:    

Similar News