మెగాస్టార్ చిరంజీవికి కరోనా అక్కడే సోకి ఉంటుందా..?

Update: 2020-11-09 13:30 GMT
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. 'ఆచార్య' షూటింగ్‌ స్టార్ట్ చేసే ఉద్దేశ్యంలో కోవిడ్ టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌ అని తేలిందని చిరంజీవి ట్విటర్ ద్వారా వెల్లడించారు. 'ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను'' అని చిరు ట్వీట్ చేశారు. కరోనా బారిన పడిన చిరంజీవి త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. అలానే మెగాస్టార్ కి కరోనా ఎలా సోకిందనే విషయంపై పెద్ద ఎత్తున డిస్కస్ చేస్తున్నారు.

చిరంజీవి ఇటీవల ప్రముఖ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె కుమార్తె పెళ్ళికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ మధ్య చిరంజీవి అటెండ్ అయిన మ్యారేజ్ ఫంక్షన్ అదేనని.. ఎక్కువ సంఖ్యలో జనసమూహం ఉండటంతో అక్కడ ఎవరో ఒకరి నుంచి ఆయనకు కరోనా సోకి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వధూవరులు చిరంజీవితో కలిసి దిగిన ఫోటోలు చూస్తే సోషల్ డిస్టెన్స్ పాటించినట్లు కనిపించలేదు. దీంతో అక్కడే చిరు కి కరోనా అటాక్ అయ్యుంటుందని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం వివాహం జరిగి ఇప్పటికే 10 రోజులకు పైగా అయిందని.. అక్కడ వచ్చి ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇక చిరంజీవి మాత్రం గత 4-5 రోజుల్లో తనను కలిసినవారందరూ టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. చిరు ఇటీవల అక్కినేని నాగార్జున మరియు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News