గోపీచంద్ - మెహ్రీన్ కౌర్ లు జంటగా నటించిన పంతం సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ హీరోగా మంచి ఇమేజ్ ఉన్న గోపీచంద్ తో కొత్త దర్శకుడు కె. చక్రవర్తి తెరకెక్కించిన ఈ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ కు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ....బీ - సీ సెంటర్లలో మంచి కలెక్షన్లు రాబడుతోంది. తన 25వ సినిమా `పంతం`లో గోపీచంద్ పర్ ఫార్మన్స్ మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మాస్ సెంటర్లలో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ చిత్రం విడుదలైన తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 5.2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మంచి మెసేజ్ తో రూపొందించిన ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ కు.... ఈ వీకెండ్ లో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలిరోజు ఏపీ - తెలంగాణ - ఓవర్సీస్ లలో ఏరియా వైస్ `పంతం` వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం - 1,12,00,000
సీడెడ్ - 47,00,000
నెల్లూర్ - 12,00,000
గుంటూరు - 33,00,000
కృష్ణా - 15,77,125
పశ్చిమ గోదావరి - 16,35,976
తూర్పు గోదావరి - 20,92,000
ఉత్తరాంధ్ర - 34,79,085
ఏపీ - తెలంగాణలలో తొలి రోజు షేర్- 2.92 కోట్లు
భారత్ లోని మిగతా రాష్ట్రాల్లో వసూళ్లు - 20,00,000
ఓవర్సీస్ - 10,00,000
ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు వసూళ్లు గ్రాస్-5.2 కోట్లు - షేర్-3.22 కోట్లు
నైజాం - 1,12,00,000
సీడెడ్ - 47,00,000
నెల్లూర్ - 12,00,000
గుంటూరు - 33,00,000
కృష్ణా - 15,77,125
పశ్చిమ గోదావరి - 16,35,976
తూర్పు గోదావరి - 20,92,000
ఉత్తరాంధ్ర - 34,79,085
ఏపీ - తెలంగాణలలో తొలి రోజు షేర్- 2.92 కోట్లు
భారత్ లోని మిగతా రాష్ట్రాల్లో వసూళ్లు - 20,00,000
ఓవర్సీస్ - 10,00,000
ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు వసూళ్లు గ్రాస్-5.2 కోట్లు - షేర్-3.22 కోట్లు