చిల్ట్ర‌న్ డే రోజున లోకేష్ ను మ‌ళ్లీ ఆడుకున్నాడు!

Update: 2019-11-14 11:12 GMT
`క‌మ్మ‌ రాజ్యంలో క‌డ‌ప‌ రెడ్లు` రిలీజ్ కు ద‌గ్గ‌ర‌ ప‌డుతున్న  కొద్దీ ఆర్జీవీ టెన్ష‌న్‌ పెంచేస్తున్నాడు. వివాదం తో ప్ర‌చారాన్నే త‌న ఆయుధం గా మార్చుకుని జ‌నాల‌ పైకి విసురుతున్నాడు. అందులోనూ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు.. ఆయ‌న త‌న‌యుడు లోకేష్ నాయుడు ల‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమా ని జ‌నాల మ‌ధ్య‌కు తీసుకెళ్లే ప‌ని లో ఉన్నాడు. బాబు త‌న‌యుడి ప్లేటు లో ప‌ప్పు వ‌డ్డించ‌డం ద‌గ్గ‌ర నుంచి.. ప‌ప్పు స్పీచ్ లు దంచే వ‌ర‌కూ ప్ర‌తి విష‌యం లో యువ‌ నేత లోకేష్ ని టార్గెట్ చేసాడు. ఇక ఇత‌ర కీల‌క‌ పాత్ర‌లైన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. కే.ఏ పాల్ ను అంతే కామిక్ గా ఎలివేట్ చేస్తున్నాడు. ఈ సినిమా లో ఎమోష‌న్ ఎంత‌.. సీరియ‌స్ నెస్ ఎంత అన్న‌ది ఎవ‌రికీ తెలియ‌దు గానీ! వ‌ర్మ ప్ర‌చారం లో ఎప్ప‌టి లానే తెలివి తేట‌లు చూపిస్తున్నాడు. నాయ‌కుల్ని క‌మెడియ‌న్ల‌ ను చేయ‌డం ద్వారా.. వారి పై సెటైర్లు పంచ్ లు వేయ‌డం ద్వారా జ‌నాల్ని ఎట్రాక్ట్ చేస్తున్నాడు.

తాజాగా నేడు (గురువారం) బాల‌ల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని మ‌రోసారి ప‌ప్పు తో ఆడుకున్నాడు. మ‌రోసారి ఎంతో కామిక్ టైమింగ్ ఉన్న ఫోటో ను రిలీజ్ చేసాడు. అందులో లోకేష్ పాత్ర దారి.. త‌న‌యుడు దేవాన్ష్ తో స‌ర‌దాగా ఓ గ్రౌండ్ లో ఆడుకుంటోన్న స్టిల్ ను రిలీజ్ చేసాడు. ఆ ప‌క్క‌నే చంద్ర బాబు  పాత్ర‌ధారి త‌న‌యుడి వైపు చూస్తుండ‌టం గ‌మ‌నించ‌వ‌చ్చు. వ్యంగ్యం తో కూడిన సెటైర్ ఇది.

ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియా లో సునామీ లో దూసుకు పోతుంది. ఈ నేప‌థ్యం లో వైకాపా నేత‌లు సూప‌ర్భ్  అంటూ కామెంట్లు పెడుతుండ‌గా.. తేదేపా వ‌ర్గాలు వ‌ర్మ‌ను త‌మ‌దైన శైలి లో విమ‌ర్శించ‌డం మొద‌లు పెట్టారు. కొంద‌రైతే టీడీపీ పార్టీ కార్య‌ల‌యం లో తండ్రీ కొడుకులిద్ద‌రూ భ‌లే గా ఆడుకుంటున్నారంటూ  కామెంట్లు పెడుతున్నారు. ఓ అభిమాని ఆర్జీవీ చిన్న పిల్లాడి గా ఉన్న‌ప్ప‌టి ఫోటోని ట్యాగ్ చేసి మ‌రీ ఈ ట్వీట్ కి రీట్వీట్ చేశాడు. మొత్తానికి వ‌ర్మ చిన్న పిల్ల‌ల రోజుని కూడా వ‌దిలి పెట్ట‌లేదు సుమీ.


Tags:    

Similar News