వివాదాస్పద నటి శ్రీరెడ్డి టాలీవుడ్ లోని కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. నిన్న తన ఫేస్ బుక్ ఖాతాలో పలువురు టాలీవుడ్ హీరోయిన్లు - నటులు - యాంకర్ల ఫొటోలను షేర్ చేసి దుమారం రేపింది. చికాగో సెక్స్ రాకెట్ లో అవకాశాల పేరుతో వర్ధమాన నటీమణులను కొందరు మోసం చేస్తున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది. అయితే శ్రీరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది క్యారెక్టర్ ఆర్టిస్టు చేసే నటి పవిత్రా లోకేష్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె స్పందించారు.
పవిత్ర లోకేష్ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ శ్రీరెడ్డిపై పరోక్షంగా సెటైర్లు పేల్చింది. కాస్టింగ్ కౌచ్ విషయంలో సంచలన విషయాలను వెల్లడించింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి. పవిత్ర లోకేష్ మాట్లాడుతూ.. ‘‘కాస్టింగ్ కౌచ్ అంశం అనేది చాలా సున్నితమైనది.. ఈ విశ్వంలో ఆడ - మగ అనే రెండే జాతులున్నాయి. ఆడవాళ్లు మగవాళ్లని.. మగవాళ్లు ఆడవాళ్లను ఉపయోగించుకోవడం అనేది అన్ని రంగాల్లో ఉంది. అదే ప్రకృతి ధర్మం’ అని కుండబద్దలు కొట్టింది.
‘మన బతకడానికి డబ్బు అవసరం . అధికమొత్తంలో డబ్బు కావాలని భావిస్తే అదే స్థాయిలో ఇతర పనులు కూడా చేయాలి. ఆ పనిచేసే ముందు ఎందుకు చేస్తున్నాం అని ఆలోచించాలి. అంగీకరించి ఆ పనిచేస్తే అది మన సమస్య మాత్రమే అవుతుంది.’ అంటూ కాస్టింగ్ కౌచ్ తప్పుకాదని చూచాయ గా వెల్లడించింది.
పవిత్ర మాట్లాడుతూ ‘కాస్టింగ్ కౌచ్ అనేది నా దృష్టిలో చాలా పెద్ద పేరు. 4 - 5 ఏళ్ల చిన్నారులు రేప్ కు గురవుతున్నారు. ఇది అసలు పెద్ద విషయం . ఎవరైనా మాట్లాడితే ఈ చిన్న పిల్లల దారుణాలపై మాట్లాడండి.. కాస్టింగ్ కౌచ్ పై కాదు’ అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది.
‘పరిణతి చెందిన ఇద్దరు ఆడ - మగ మధ్య జరిగిన వ్యవహారం గురించి ఎందుకు ఇంత రచ్చ. దీనికి అంగీకరిస్తున్న వారంతా 4 - 5 ఏళ్ల చిన్న చిన్నారులు కాదు కదా.. ఏదో ఆశించి ఈ పనికి ఒప్పుకుంటున్న వారే మళ్లీ కాస్టింగ్ కౌచ్ అంటూ గేములు ఆడుతున్నారు. ఆడ, మగ మధ్య జరుగుతున్న విషయానికి అగ్రిమెంట్ ప్రకారం అంగీకరిస్తున్నారు. ఈ విషయాన్ని మొదట్లోనే నో చెప్పే చాయిస్ ఉంది. కానీ ఎందుకు అలా చేయడం లేదు. కానీ ఇప్పుడు బయటకు వచ్చి వాడుకున్నారు అని గోల చేస్తే ఎలా ’’ పవిత్ర లోకేష్ మండిపడింది.
Full View

తాజాగా శ్రీరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ గానే పవిత్ర ఈ ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అవకాశాల కోసం - అవసరాల కోసం - డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారని.. ఇష్టం తో చేస్తే తప్పులేదని చెప్పి పవిత్ర చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.