ఇప్పుడు ఇదే అనుమానం పవన్ ఫాన్స్ మైండ్ ని తొలిచేస్తోంది. ఇందాక నా పేరు సూర్య సక్సెస్ మీట్ ని 10వ తేది సాయంత్రం 7 గంటల నుంచి నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. దానికి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు అని అఫీషియల్ గా ప్రకటించడం బన్నీ అండ్ పవన్ ఫాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చేస్తోంది. ఇక్కడే ఉంది అసలు చిక్కు. అదే రోజు దాదాపు అదే సమయంలో రవితేజ నేల టికెట్ ఆడియో వేడుక కూడా నిర్వహించబోతున్నారు. దానికీ పవన్ కళ్యాణే ముఖ్య అతిధి. ఈ విషయాన్ని వారం ముందు నుంచే ఆ టీం ప్రచారంలో పెట్టింది. మరి పవన్ ఎక్కడికి వస్తాడు అనేదే పెద్ద డౌటానుమానం. నేల టికెట్ వెన్యు కూడా ఫిక్స్ అయిపోయింది. నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో ఇందుకు తగ్గ ఏర్పాట్లు కూడా పూర్తైపోయాయి. అంత నమ్మకంగా పవన్ వస్తాడు అని ముందు నుంచి చెబుతున్నారు కాబట్టి డ్రాప్ అయ్యే ఛాన్స్ లేనట్టే.
మరి థాంక్స్ టు ఇండియా పేరుతో నా పేరు సూర్య చేస్తున్న ఈవెంట్ కు కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అని ఇందాక ప్రకటించారు. రెండు ఈవెంట్స్ కి మధ్య ప్రకటించిన సమయంలో గంట వ్యత్యాసం ఉన్నప్పటికీ ఇంచుమించు ప్రారంభ లాంచనాలు అన్ని పూర్తయ్యి పవన్ స్పీచ్ తదితరాలు అన్ని మొదలయ్యే లోపు రెండు ఈవెంట్స్ టైం క్లాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. మరి పవన్ కళ్యాణ్ రెండింటికి వస్తాడా లేక ఏదైనా స్పెషల్ ప్లానింగ్ తో ఒకదానికి ముందు వచ్చి రెండోదానికి కాస్త ఆలస్యంగా వెళ్తాడా అనేది ఇప్పుడు చర్చగా మారింది. నేల టికెట్ వేదిక ఖారారుగా చెప్పేశారు కాని నా పేరు సూర్యది ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ రెండు వేదికలు తక్కువ దూరంలో ఉంటే కవర్ చేయటం అసాధ్యం అయితే కాదు. లేదు దూరంగా ఉన్నాయి అంటే మాత్రం ట్రాఫిక్ పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందులు తప్పవు. పైగా రెండు ఈవెంట్స్ జరుగుతోంది వీక్ ఎండ్ లో కాదు. వీక్ మధ్యలో అందులోనూ నగరవాసి జీవితం గజిబిజిగా ఉండే సాయంత్రం పూట. సో ఈ వ్యవహరం అంత తాపీగా ఉండదు. వీటిలో మళ్ళి ఏదైనా మార్పు ఉంటుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.