మూడున్నరేళ్ల విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ కెమెరా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కొంత విరామం తరువాత ఆయన నటించిన మూవీ 'వకీల్ సాబ్'. ఈ మూవీతో సక్సెస్ ని సొంతం చేసుకుని మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు పవన్ కల్యాణ్. ఆ తరువాత 'భీమ్లానాయక్'తో హడావిడి చేసిన ఆయన ప్రస్తుతం జానపద చిత్రం 'హరి హర వీరమల్లు' మూవీలో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్ లో మెగా సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ. దయాకర్ రావుతో కలిసి స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు.
ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. త్వరలోనే మరో రీమేక్ ని పట్టాలెక్కించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో సముద్రఖని నటించి తెరకెకకించిన 'వినోదాయ సితం'ని తెలుగులో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ కల్యాణ్ నటించనుండగా యంగ్ హీరో పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపించే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో పాటు హరీష్ శంకర్ తో 'భవదీయుడు భగత్ సింగ్ ' మూవీ చేయాల్సి వుంది.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన నిర్మాతలని పరుగులు పెట్టిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా వుండాలని ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్న పవన్ కల్యాణ్ ఈ దసరా తరువాత నుంచి పవన్ ఏపీ లో ప్రత్యేక యాత్రని నిర్వహించబోతున్నారు. ఇదే విషయాన్ని తాజాగా వెల్లడించారు కూడా. దీంతో పవన్ నిర్మాతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ డెట్ లైన్ లో సినిమాలు పూర్తి చేయాలని పవన్ డేట్స్ కోసం నిర్మాతలు పోటా పోటీగా పోటీపడుతున్నారట. కారణం ఏంటంటే దసరా తరువాత పవన్ ని పట్టుకోవడం కష్టం. ఏపీ వ్యాప్తంగా ప్రత్యేక టూర్ ని నిర్వహించితన అనంతరం పవన్ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి వెళ్లిపోతారు.
మళ్లీ ఆయనని కలవాలంటే ఎన్నికల తరువాతే. ఏది వున్న ఎన్నికలకు ముందే పూర్తి చేసుకోవాలి. దసరా లోపే కంప్లీట్ చేసుకోవాలి. ఈ నేపథ్యంలో పవన్ తో సినిమాలు ప్లాన్ చేసిన నిర్మాతలు దసరాకు ముందే మూవీని కంప్లీట్ చేయాలని, ఇందుకు పవన్ డేట్స్ ని సొంతం చేసుకోవాలని నిర్మాతలు పోటీపడుతున్నారట. ఇప్పటికే పవన్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' షూటింగ్ ఆగుతూ సాగుతూ వుంది. దీన్ని ఎట్టిపరిస్థితుల్లో దసరా కు ముందే పూర్తి చేయాలనుకుంటున్నారట.
ఇక ఇదే దారిలో ఓ రీమేక్ మూవీని కూడా ముందుగానే పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీన్ని నటుడు సముద్ర ఖని డైరెక్ట్ చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి విరాలు తెలియాల్సి వుంది. ఇప్పుడున్న టైట్ షెడ్యూల్ లో హరీష్ శంకర్ 'భవదీయుడు భగత్ సింగ్'ని ప్రారంభించడం, పూర్తి చేయడం కుదరని పని. దీన్ని పట్టాలెక్కించాలంటే ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.
ఎటొచ్చీ నిర్మాత ఏ.ఎం. రత్నయే ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో వున్నారు. 'హరి హర వీరమల్లు' మూవీని షూటింగ్ ఆగుతూ సాగుతూ అన్నట్టుగా నడుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మూవీని రాకెట్ స్పీడుతో పూర్తి చేయడం కష్టమే, ఎంత దసరా వరకు షూటింగ్ పూర్తి చేసినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ప్యాచ్ వర్క్ కంప్లీట్ కాదు. దీంతో ఈ మూవీ దసరాకు రిలీజ్ కష్టమే అని తెలుస్తోంది.