పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీ హీరోల సినిమాలే చూడడంటారు. మరి ఎన్టీఆర్ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ చూసి ఉంటారా అని ఆశ్చర్యపోకండి. నమ్మడం కొంచెం కష్టమే కానీ.. ఇది నిజం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. పవన్ కళ్యాణ్ ‘నాన్నకు ప్రేమతో’ మూవీ చూశాడట. ఆ సినిమాకు బాగా కనెక్టయిపోయాడట. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో చాలా ఎమోషనల్ అయ్యాడట. తన తండ్రిని గుర్తుకు తెచ్చుకుని కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడట. ఇది పవన్ సన్నిహితులు చెబుతున్న మాట.
‘నాన్నకు ప్రేమతో’ గురించి సన్నిహితులు గొప్పగా చెబుతుంటే పవన్ తన కోసం స్పెషల్ షో వేయించుకుని చూశాడట. ఎన్టీఆర్, రాజేంద్ర ప్రసాద్ ల ఎమోషన్ పెర్ఫామెన్స్ గురించి ప్రశంసలు కూడా కురిపించాడట పవన్. అలాగే సుకుమార్ దర్శకత్వ ప్రతిభను, ఆయన క్రియేటివిటీని కూడా పొగిడాడని సమాచారం. దీనిపై అధికారిక వార్తేమీ రాలేదు. వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే పవన్ ఇలాంటి విషయాలు బయటికి చెప్పడానికి అంతగా ఇష్టపడడు. పవన్ నిజంగా ‘నాన్నకు ప్రేమతో’ చూసి ఉంటే మాత్రం అది మంచి విషయమే.